Rakulpreet singh: ‘ఇక నువ్వు హీరోయిన్’గా పనికిరావు అన్నారు అంటూ…తన గురించి ఆసక్తికర అంశాలు బయటపెట్టిన రకుల్ !

ప్రతి హీరోయిన్ తనకు సినిమాలో అవకాశాలు రావడానికి ఎంతో కష్టపడుతూ ఉంటుంది. డైరెక్టర్ ఎలా చెప్తే అలా వారి రూపురేఖలు మార్చుకుంటూ ఉంటారు. అందులో భాగంగా బరువు తగ్గడం, పెరగడం లాంటివి ఎన్నో సాహసాలు చేస్తూ ఉంటారు.
ఈ సాహసంలో భాగంగానే రకుల్ ప్రీత్ సింగ్ కూడా తాను నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘దేదే ప్యార్ దే’ సినిమా కోసం ఏకంగా 8 కిలోల బరువు తగ్గింది. ఇలా బరువుతగ్గి సన్నగా అయిపోయిన నా ఫోటో షోషల్ మీడియాలో చూసి, ఇక నువ్వు హీరోయిన్ కి పనికిరావు అంటూ కొంతమంది కామెంట్స్ చేసారు.
ఇక ఇలాంటివి నాకు మాములే కదా అనుకోని నా పనే నీ విమర్శలకు సమాధానం చెబుతుంది అని నన్ను నేను సముదాయించుకున్నా.. అనుకున్నట్లుగానే నాకు ‘దేదే ప్యార్ దే’ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది అని రకుల్ తెలిపింది.
రకుల్ ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన ‘చెక్’ మూవీలో హీరోయిన్ గా అదేవిదంగా బాలీవుడ్లో ‘మేడే’ సినిమాలో బిజిగా ఉంది.