Rakul Preet Singh : సైక్లింగ్ చేస్తూ…తన గమ్యస్థానానికి చేరుకున్న హీరోయిన్ !
Rakul Preet Singh : టాలీవుడ్ లో పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేసే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అమ్మడు నిత్యం వర్కౌట్స్ చేస్తూ ఫిట్ గా ఉండటానికి ఇష్టపడుతుంది. ఇలా ఫిజిక్ ని కాపాడుకుంటే సినిమాలో అవకాశాలతో పాటు, ఆరోగ్యకూడా బాగుంటుందని నమ్మిన భామ టాలీవుడ్ హీరోయిన్ రకుల్.

రకుల్ తన వర్కౌట్ వీడియోలను, ఫొటోస్ ని తన అభిమానులతో షోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ఫిట్నెస్ ఫిరంగి 12 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ షూటింగ్ స్పాట్ కి వెళ్ళింది. మనదేశంలో కంటే వేరే దేశాల్లో ఇలా సైక్లింగ్ చేస్తూ ఆఫిసులకి, పనులుచేసే ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు.
రకుల్ ఇలా సైక్లింగ్ చేస్తూ ప్రజలకు వారి ఆరోగ్యంపై తగిన శ్రద్ద పెట్టాలని చెప్పకనే చెప్పినట్టు ఉంది. ఈ విషయంలో రకుల్ ని చూసి నేర్చుకోవలసిన విషయంలో ఇది ఒకటని చెప్పొచ్చు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో బిజిగా ఉంది. ఈ సందర్భంలోనే సైకిల్ పై షూటింగ్ కి వెళ్తున్న ఫోటోలు తెగ వైరల్ గా మారాయి.