Tollywood news in telugu
rakul preet singh : టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ కు కరోనా పాజిటివ్..

rakul preet singh : మొన్నటివరకు మాల్దీవ్ లలో ఎంజాయ్ చేసిన ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన షోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో తెలిపింది.
తనకు కొన్నిరోజుల నుండి ఆరోగ్యానికి సంబదించిన చిన్న సమస్యలు రావడంతో టెస్ట్ చేయిన్చుకున్నానని, దీనితో నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపింది , ప్రస్తుతం తాను క్వారంటైన్లో ఉన్నానని , ఆరోగ్యం కూడా బాగానే ఉందని రకుల్ వెల్లడించింది.
కరోనా నుండి కోలుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని అతి త్వరలోనే కోలుకొని మల్లి సినిమా షూట్ లో పాల్గొంటానని చెప్పుకొచ్చింది. ఇటీవల నన్ను కలిసిన వాళ్ళందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్ కోరింది.