Viral news in telugu
పడిలేచిన కెరటం లా ప్లై బోర్డ్ పై ఎగిరిన రకుల్ !

టాలీవుడ్ అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్, ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న సంగతి విషయాన్నీ షోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంది. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోగా, దాదాపు ఎనిమిది నెలల పాటు ఇంటికే పరిమితమైన రకుల్, కొన్నిరోజులు ఎంజాయ్ చేయడానికి తన స్నేహితులతో కలిసి మాలేకు పయనమైంది.
ఆ విహార యాత్రలో సాహసయాత్రను కూడా భాగం చేస్తూ, సముద్రంలో ఎంతో దైర్యంగా ప్లైబోర్డ్ చేసింది. సముద్రంలోని నీటి ఒత్తిడి ఆధారంగా ఎగిరే మిషన్ పై నిలబడాలని పదేపదే ప్రయత్నించి ఏడుసార్లు కిందపడిన తరువాత, ఎనిమిదోసారి విజయవంతంగా నిలబడగలిగానని చెబుతూ, తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
రకుల్ షోషల్ మీడియాను ఫాలో అయ్యే అభిమానులు రకుల్ నువ్వు ఎంతైనా ధైర్యవంతురాలేవి అని పొగుడుతున్నారు .