Tollywood news in telugu

నాగచైతన్య విసిరిన ఛాలెంజ్… పూర్తీ చేసిన రకుల్ !

Rakul

తెలంగాణాలో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘ కు అపూర్వ స్పందన వస్తుంది. ముందుగా రాజ్యసభ సభ్యుడు జోగిపల్లి సంతోష్ మొదలు పెట్టాడు. అప్పటినుండి ఈ మొక్కలునాటే ఛాలెంజ్ ని ఒకరి పై ఒకరు విసురుకుంటూ మొక్కలు నాటుతున్నారు.

అప్పటినుండి ఇప్పటివరకు సెలెబ్రిటీలు ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటారు, ఇపుడు నాగచైతన్య , రకుల్ కి ఛాలెంజ్ చేయగా రకుల్ తన బాధ్యతగా ఆ ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కను నాటింది.

ఈ సందర్బంగా రకుల్ మాట్లాడుతూ ఇది ఏ ఒక్కరితోనో అయ్యే పనికాదు, ప్రతి ఒక్కరు ఛాలెంజ్ గా తీసుకొని మొక్కలు నాటి మన ప్రకృతిని  మనమే కాపాడుకోవాలని ప్రజలని, తన అభిమానులను కోరింది. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button