rajiv kanakala : సుమతో విడాకుల విషయం పై స్పందించిన రాజీవ్ …. గొడవ నిజమే !

రాజీవ్ కనకాల,సుమాల విషయంలో ఆ మధ్య షోషల్ మీడియాలో యాంకర్ సుమ-రాజీవ్ కనకాల విడిపోయారని, పిల్లల్ని కూడా విదేశాలకు పంపించేసి సుమ ఒంటరిగా ఉంటుందంటూ ఏవేవో కట్టు కథలు బయటికివచ్చాయి.
ఈ కట్టు కథలు పై యాంకర్ సుమ కానీ.. రాజీవ్ కనకాల కానీ ఎమ్ మాట్లాడలేదు . కానీ ఇద్దరు కొన్ని రోజుల కు ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను షేర్ చేయడమే కాకుండా, ఈ ఇద్దరూ జంటగా కొన్ని టీవీ షోలలో పాల్గొని గాసిప్ చెక్ పెట్టారు.
అయితే ఈ విషయం పై తాజాగా ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల మాట్లాడారు. ఈ విషయంలో సుమ బాధపడిన విషయాన్నీ వివరించారు. అందరి ఇళ్లల్లో ఉన్నట్టే మా మధ్య కూడా గొడవైంది. ఈ గొడవ మీడియాకి వేరే విధంగా వెళ్లింది.
ఈ చిన్న విషయం పెద్దదై.. విడాకులు వరకూ వెళ్లిందా అని న్యూస్ చూసి మేమె షాక్ అయ్యాం . దాని మీద మేం రెస్పాండ్ అయితే మళ్లీ వేరే కథనం వస్తుంది. ఎందుకొచ్చిన గొడవలే.. కలిసి ఉన్నట్టుగానే ఒక వీడియో పెడితే మీడియా వాళ్ళు అదేవిదంగా ప్రజలు అర్థం చేసుకుంటారులే అని అనుకుని ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి ఆ న్యూస్ కి పులిస్టాప్ పెట్టాం అని తెలియజేసారు.