షూటింగ్ కి సిద్దమవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ … !

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పూర్తిగా కోలుకున్నారు. ఇక మళ్లీ షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రజని శివ డైరెక్ట్ చేస్తున్న ‘అన్నాత్తే’ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గత డిసెంబర్ లో రాజధాని హైదరాబాదులో కొన్ని రోజులు జరుపుకుంది. ఆ సమయంలో షూటింగ్ జరుగుతుండగానే రజనీకాంత్ అస్వస్థతకు గురికావడంతో.. ఆయనను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. రెండు రోజులు హాస్పిటల్ లో ఉన్న తరువాత విశ్రాంతి తీసుకోవడం కోసం చెన్నై లోని తన ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు తాజాగా రజని పూర్తీ గా కోలుకోవడంతో షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టమని దర్శక, నిర్మాతలకు తెలియజేసారు. ఈ సందర్బంగా షూటింగును వచ్చే నెల 15 నుంచి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నవంబరు 4న విడుదల కానున్న ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్ నాయికలుగా నటిస్తున్నారు
మరి ఈ షూటింగ్ ను తిరిగి హైదరాబాదులో చేస్తారా… లేదా చెన్నైలోనే జరుపుతారా… అన్నది ఇంకా ప్రకటించలేదు.