telugu cinema reviews in telugu language

Rajinikanth New Movie Review : సోది లేకుండా ఒక్క ముక్కలో జైలర్ మూవీ రివ్యూ..!

Rajinikanth New Movie Review :

మూవీ: జైలర్.

యాక్టర్స్ : రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, మోహన్‌లాల్, శివరాజ్‌ కుమార్, వసంత్ రవి, యోగిబాబు తదితరులు.

ప్రొడ్యూసర్ : కళానిధి మారన్.

డైరెక్టర్ : నెల్సన్ దిలీప్ కుమార్.

మ్యూజిక్ : అనిరుధ్ రవిచందర్.

సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్.

రిలీజ్ : 10 ఆగస్టు 2023

జైలర్ మూవీ స్టోరీ ఏంటి? :

టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) అనే రిటైర్డ్ జైలర్ ఉండేవాడు. ఇతని ముద్దుగా ముత్తు అన్ని పీల్చుకుంటారు. అలాగే ఈ ముత్తుకి అర్జున్ (వసంత్ రవి) అనే కొడుకు ఉంటాడు.అర్జున్ ఎసిపి గా చాలా నీతిగా నిజాయితీగా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. అయితే ఈయన విగ్రహాలు చోరీ చేసే వాళ్లతో ఘర్షణ పడుతూ ఉంటాడు. ఒకరోజు అర్జున్ కనిపించకుండా పోతాడు. దీంతో తండ్రైన ముత్తు అతని ఆచూకీ కోసం అంతటా గాలిస్తాడు. చివరికి ముత్తు కి ఆచూకీ దొరుకుతుందా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే..

సినిమా ఫస్ట్ ఆఫ్ లో సీన్ బై సీన్ మంచి ఫ్లో లో వెళుతుంది. స్క్రీన్ ప్లే అనుకున్నట్టుగానే డైరెక్టర్ ప్రీ ఇంటర్వెల్ వరకు బాగానే చూపెట్టాడు. సెకండ్ హాఫ్ లో మూవీ ఎటు వెళ్లి పోతుందో ప్రేక్షకులకు అర్థం కాదు. దీంతో ప్రేక్షకులు కొంత సేపు గందరగోళానికి గురవుతారు. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి మళ్ళీ సినిమా గాడిన పడుతుంది. సినిమాలో రజనీకాంత్ హీరోఇజన్ని డైరెక్టర్ మంచిగా చూపెట్టాడు. రజినీకాంత్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు.. ఎప్పటిలానే ఇరగదీశాడు..

రేటింగ్: 2 5/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button