Political NewsTollywood news in telugu
RajiniKanth: తలైవా అభిమానులకు శుభవార్త…రజిని డిశ్చార్జ్

సూపర్ స్టార్ రజినీకాంత్ శుక్రవారం అనారోగ్య సమస్యలతో అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న అపోలో హాస్పిటల్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సూపర్ స్టార్ కి రక్తపోటులో హెచ్చుతగ్గులు నమోదవుతుండటంతో అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడడంతో ఆదివారం మధ్యాహ్నం రజినీకాంత్ ని డిస్చార్జ్ చేయబోతున్నట్లు వైద్యాధికారులు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు రజినిని వారి కుటుంబ సభ్యులు చెన్నైకి తరలిస్తున్నట్లు తెలిసింది.