Tollywood news in telugu

Rajini is coming in his Mass Style on Diwali : పెద్దన్న వచేస్తున్నాడోచ్ :-

Rajini is coming in his Mass Style on Diwali

Rajini is coming in his Mass Style on Diwali : హెడ్డింగ్ చదవగానే మీకు మ్యాటర్ అర్ధం అయిపోయింటది. పెద్దన మరెవరో కాదు మన సూపర్ స్టార్ రజినీకాంత్ గారే. ఇన్నిరోజులు తమిళ్ లో అన్నాఠే , అన్నాఠే , సూపర్ స్టార్ రజిని ఇన్ అన్నాఠే అనే పదం వినివిని తమిళ పదమే అందరికి అలవాటయిపోయింది.

అయితే దసరా కానుకగా ఈ సినిమా బృందం తెలుగు వెర్షన్ టైటిల్ అధికారికంగా ప్రకటించారు. ఆ టైటిల్ మరేదో కాదు అదే పెద్దన్న. రజిని సినిమా తమిళ్ లో అన్నాఠే అయితే తెలుగు లో పెద్దన్న అని అధికారిక ప్రకటన జరిగింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4 న విడుదలకు సర్వం సిద్ధం అయింది. ఈరోజు సెన్సార్ కూడా పూర్తిచేసుకొని యు/ ఏ సర్టిఫికెట్ పొందినట్లు చిత్రబృందం తెలిపారు. ఈ సినిమా ని మాస్ కధలకు కేర్ అఫ్ అడ్రస్ అయినా శివ దర్శకత్వం వహించగా , రజిని సరసన హీరోయిన్ గా నయనతార మరియు చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించబోతున్నారు.

వీరితోపాటు ముఖ్య పాత్రలలో మీనా , ఖుష్బు మరియు ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నారు. టీజర్ చూడగానే అవుట్ అండ్ అవుట్ మాస్ ఫిలిం గా కనిపించిన ఈ సినిమా ఓవరాల్ గా ఏ రేంజ్ లో ఉండబోతుందో నవంబర్ 4 న తెలిసిపోతుంది.

ఏదేమైనా రజిని ని మాస్ గా చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కంటున్న కల. పేట మరియు దర్బార్ ద్వారా అభిమానుల కోరిక సగం పూర్తయింది..ఇపుడు ఈ పెద్దన్న తో అభిమానులు పూర్తిగా మాస్ రీలోడెడ్ రజినీని చూసి థియేటర్లో మాస్ హుంగామ చేయబోతున్నారు. చూడాలి మరి నవంబర్ 4 కోసం ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నారు అభిమానులు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button