Tollywood news in telugu

హీరో రాజశేఖర్.. కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ !

rajashekar movie fist look

హీరో  రాజ‌శేఖ‌ర్‌ మరో కొత్త సినిమా ‘శేఖర్ ‘ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి లలిత్ కుమార్ దర్శకత్వం వహించగా, ఇది ఒక క్రైమ్ త్రిల్లర్ కథాంశం తో తెరకెక్కుతుంది.   ఈ రోజు రాజశేఖర్ పుట్టినరోజు  సందర్భంగా సినిమా యొక్క  ఫస్ట్‌లుక్‌ను  యూనిట్ సభ్యులు రిలీజ్ చేసారు.

ఇక ఈ సినిమా లో రాజ‌శేఖ‌ర్ కొత్త త‌ర‌హా లుక్‌లో కూల్ గా కనబడుతున్నాడు. ఇందులో శేఖర్  ముఖంలోని స‌గ భాగాన్ని  చిత్ర యూనిట్ విడుదలచేసింది. సినిమాయొక్క షూటింగ్  ఈ నెల మూడో వారం నుంచి  ప్రారంభం కానుంది.

ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుచుతుండగా, లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్పొరేషన్ సంస్థలు  సినిమాను రూపొందిస్తున్నాయి.

తన బర్త్ డే సందర్బంగా హీరో  రాజశేఖర్ మాట్లాడుతూ, తాను  క‌రోనా కార‌ణంగా తీవ్ర అనారోగ్యం పాలై ఆసుప‌త్రి‌లో చికిత్స తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో అండగా నిలిచిన అభిమానులకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్రేక్షక అభిమానం వల్లే ఈ రోజు ‌ కొత్త సినిమాను ప్రారంభించగలుగుతున్నానని కొంత బావోదేవగంతో తెలిపాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button