Tollywood news in telugu

భారీ బందోబస్తు నడుమ తలైవా రజనీకాంత్

ఆలిండియా సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ ఏంటో అందరికి తెలుసు. స్వయంకృషితో ఒక సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుండి దేశం గర్వించదగ్గ గొప్ప స్టార్ గా ఎదిగాడు. ఆయన జీవితం ఏంటో మందికి ఆదర్శం అనే చెప్పాలి. ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండాలి అనే గొప్ప సత్యంకి నిల్లువెత్తు ఉదాహరణ మన రజనీకాంత్ గారు. ఆయన కి ఒక్క భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ముఖ్యంగా జపాన్ వంటి దేశాల్లో కూడా ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన 162 వ సినిమా ‘పిజ్జా’ ఫేమ్‌ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘petta’ అనే మూవీలో నటిస్తున్నారు. ఇందులో సిమ్రాన్, త్రిష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, విజయ్‌ సేతుపతి, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్న ఈ petta సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌ కానుందని కోలీవుడ్‌ సమాచారo.

ఈ petta సినిమా తాజా షెడ్యూల్‌ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రారంభమైoది. ఈ షూటింగ్ ప్రాంతంలో మొత్తం పాతికమంది పోలీసులు, దాదాపు నలభై మంది బౌన్సర్స్‌ రజనీకాంత్‌కు ప్రొటక్షన్‌ అందిస్తున్నారు. ఇది సినిమాలోని యాక్షన్ సీన్‌ అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. అక్కడ ఉన్నది రియల్ పోలీసులు మరియు బౌన్సర్స్. మరి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఉన్న పాపులారిటీ అలాంటిది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో రజనీకాంత్ గారు శుక్రవారం చెన్నై నుంచి వచ్చారు . ఆయనతో పాటు 40 మంది బౌన్సర్లు కూడా దిగారు. లక్నోలో అభిమానులు ఆయన్ని చూడడానికి వచ్చినప్పుడు ఒక్కసారిగా చుట్టూముడితే ఇబ్బందిగా ఉంటుందని చెన్నై నుంచి బౌన్సర్లను పంపించారు ధనుష్‌. లక్నో పోలీసులు కూడా పాతిక మంది కానిస్టేబుళ్లను, ఒక సర్కిల్‌ ఆఫీసర్‌ని పంపించారు. ఈ షెడ్యూల్‌ దాదాపు నెల రోజుల పాటు సాగుతుంది. లక్నోలోనే కాకుండా వారణాసి, సోన్‌బాద్రా ఏరియాల్లో కూడా షూటింగ్‌ ప్లాన్‌ చేశారు. ఈ షెడ్యూల్‌లోనే సుమారు 500 మంది జూనియర్ ఆర్టిస్ట్స్ తో బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఇక ‘పెట్ట’ సినిమా షూటింగ్ లొకేషన్ నుండి కొన్ని రజనీకాంత్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఇందులో రజనీకాంత్ రెడ్ కలర్ కుర్తా ధరించి మెడలో బ్లూ కలర్ స్కార్ఫ్ తో స్టైలిష్ గా ఉన్నారు. లీక్ అయిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో అలర్ట్ అయిన చిత్ర యూనిట్ సెట్‌లోకి ఎవరూ  మొబైల్స్‌ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదని దర్శక నిర్మాతలు ఆదేశాలు జారీ చేశారు.

 

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button