movie reviewstelugu cinema reviews in telugu language

Raja Vikramarka Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

Raja Viramarka Movie Review and Rating

Movie :- Raja Vikramarka (2021) Review

నటీనటులు :- కార్తికేయ , తాన్య రవిచంద్రన్ , సుధాకర్ , సాయికుమార్ , తనికెళ్ళ భరణి మొదలగు.

నిర్మాతలు :- 88 రామ రెడ్డి

సంగీత దర్శకుడు :- ప్రశాంత్ అర్. విహారి

డైరెక్టర్ :- శ్రీ సరిపల్లి

ముఖ్య గమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.

Story ( Spoiler Free ) :-

ఈ కథ ఎన్‌ఐఏ బృందం గురించి చెప్తు తనికెళ్ళ భరణి గారిని హెడ్ గా అతని టీం మెంబెర్స్ లోని ముగ్గురిలో కార్తికేయ ఒకడిగా చూపిస్తూ మొదలవుతుంది. కార్తికేయ ఎన్‌ఐఏ మెంబెర్ గా స్టైలిష్ ఇంట్రడక్షన్ తర్వాత కార్తికేయ కి ఒక మిషన్ అప్పగిస్తారు. అదేంటంటే హోమ్ మినిస్టర్ అయినా సాయికుమార్ కి సెక్యూరిటీ ఇయ్యడం. ఎటువంటి కిడ్నాపింగ్ కి హోమ్ మినిస్టర్ గురవకుండా చూసుకోవడమే కార్తికేయ మిషన్.

ఇదొక సీక్రెట్ ఆపరేషన్ కాబట్టి కార్తికేయ హోమ్ మినిస్టర్ కూతురు అయినా తాన్యా రవిచంద్రన్ యొక్క డాన్స్ మాస్టర్ కి అసిస్టెంట్ గా హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్తారు. అక్కడ అనుకోకుండా కార్తికేయ మరియు తాన్యా మధ్య ప్రేమ మొదలవడం వీరిద్దరూ ప్రేమలో పడటం క్రమంలో జరిగిపోతుంది.

ఇలా అంత బాగా జరుగుతున్నా సమయానికి ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లో హోమ్ మినిస్టర్ పైన కిడ్నాపింగ్ ప్రయత్నాలు జరగగా కార్తికేయ మరియు టీం ఎటువంటి కిడ్నాపింగ్ జరగకుండా ఆపేస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కిడ్నప్ జరిగింది. కిడ్నప్ కి గురయింది హోమ్ మినిస్టర్ కాదు హోమ్ మినిస్టర్ కూతురు తాన్యా. ఈ ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

అస్సలు ఎవరు హోమ్ మిస్టర్ ని కిడ్నప్ చేయాలనుకున్నారు ? దీని వెనకాల ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా ? తాన్యా కిడ్నప్ కి గురయింది అని తెలుసుకున్నాక కార్తికేయ మరియు సాయికుమార్ ఎలా రియాక్ట్ అయ్యారు ? ఇంతకీ కార్తికేయ తన మిషన్ కంప్లీట్ చేశాడా లేదా ? చివరికి ఎం జరిగింది. ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే.

Positives 👍 :-

  • కార్తికేయ నటన చాలా బాగుంది. అతని ఫిజిక్ మరియు మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ సినిమా అంతటా కనిపిస్తూ ప్రేక్షకులని అలరిస్తరు. హీరోయిన్ తాన్య కూడా పాత్ర మేరకు బాగా నటించింది.
  • ఫస్ట్ హాఫ్ మరియు ఇంటర్వల్ ట్విస్ట్
  • పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • సినిమాటోగ్రఫీ బాగుంది.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.

Negatives 👎🏻:-

  • పాత చింతకాయ పచ్చడి లాంటి కథ అయిన కధనం సరిగ్గా రాసుకోలేదు.
  • సెకండ్ హాఫ్ అంతా బోర్ కొట్టిస్తుంది.
  • దర్శకత్వం
  • లాజిక్ లేస్ సీన్స్.
  • ఎగ్జిక్యూషన్ అసలు బాలేదు.

Overall :-

మొత్తానికి రాజ విక్రమార్క అనే సినిమా మొదటి భాగం బాగున్నప్పటికీ రెండవ భాగం ఒకే అంశం పైన నడవడం తో పూర్తిగా నిరాశ కలిగిస్తుంది. కార్తికేయ నటన చాలా మెచ్యూర్ గా ఉంటుంది. తాన్య కూడా బాగా నటించింది. మిగితా పాత్రధారులు వారివారి పాత్ర మేరకు బాగా చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది.

ఇంటర్వల్ ట్విస్ట్ వరకు సినిమా బాగుంది కానీ సెకండ్ హాఫ్ బాగా రాసుకునింటే సినిమా హిట్ అయ్యేది. దర్శకుడు రెండవ భాగం మీద కూడా శ్రద్ధ పెట్టాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మొత్తానికి రాజ విక్రమార్క సినిమా కుటుంబం అంతా కలిసి ఓసారి కార్తికేయ నటన కోసం చూసేయచు.

Rating:- 2.5/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button