Tollywood news in telugu

రాజావారు రాణిగారు చిత్రం నవంబర్ 29న విడుదల !!!

రాజావారు రాణిగారు చిత్రం నవంబర్ 29న విడుదల:
ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకాలపై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్  సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రాజావారు రాణిగారు. కంటెంట్ ఉన్న సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పాటల వల్ల సోషియల్ మీడియాలో ఈ చిత్రానికి మంచి ఆదరణ ఉంది. ఇటీవల జరిగిన సినిమా ప్రివ్యూ చూసిన పలువురు సినీ ప్రముఖులు తమ ప్రశంశలు అందించారు. కాగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ నవంబర్ 29న చిత్రం విడుదల అవుతున్న విషయాన్ని చిత్ర బృందం ప్రకటించారు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button