Political News
Raja Singh|| తన సొంత బిజెపి పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన సొంత పార్టీ అయిన భారతీయ జనతా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు హైదరాబాద్ లోని ఇంద్ర పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గో రక్షణ కోసం అవసరమైతే తన సొంతపార్టీ పైన కూడా పోరాటం చేస్తానన్నారు. గో రక్షణ కోసం ఇప్పటికే తాను ఒక సారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రాన్ని బిజెపి పార్టీకి సమర్పించినట్టు గుర్తుచేశారు. అలాగే హిందుత్వం కోసం గో రక్షణ కోసం ఎంత పెద్ద పదవులు అయినా, పార్టీలైన …కాళ్ల కింద తొక్కి ఎస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
