సినిమా :- Raja Raja Chora Movie review (2021)

Raja Raja Chora Movie review And Rating :- నటీనటులు:- శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైనా, నిర్మాతలు:- విశ్వ ప్రసాద్ టిజి , అభిషేక్ అగర్వాల్, డైరెక్టర్ :- హర్షిత్ గోలి, మ్యూజిక్ డైరెక్టర్:- వివేక్ సాగర్
లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విదుదలైన చిత్రాలలో శ్రీ విష్ణు నటించిన రాజ రాజ చోర ఒకటి. ఎన్నో నెలల తర్వాత ప్రేక్షకుల మనసుని ఓటీటీ నుంచి థియేటర్ కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సినీ వర్గాలు. ఈ తరహాలోనే రాజ రాజ చోర వచ్చింది. ఇప్పుడీ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
కథ :-
ఈ కథ భాస్కర్ (శ్రీ విష్ణు) ని జిరాక్స్ షాపులో పనిచేస్తున్న వ్యక్తి గా చూపిస్తూ మొదలవుతుంది. కాలానుసారం భాస్కర్ సంజన (మేఘా ఆకాష్) ని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు అబధం ఆడి ప్రేమలో దింపుతాడు. ఇద్దరు ప్రేమించుకుంటారు. విచిత్రంగా భాస్కర్ కి ఇదివరకే పెళ్లయిందని, ఒక బాబు కూడా ఉన్నాడని సంజన తెలుసుకుంటుంది. ఇంతకీ భాస్కర్ కి నిజంగానే పెళ్ళయిందా? విద్యా (సునైనా) కి భాస్కర్ కి సంబంధం ఏంటి ? అసలు భాస్కర్ సంజన కి ఎందుకు అబధం చేపి ప్రేమలో దింపాడు? వీటన్నిటి మధ్య అసలు రవి బాబు పాత్రా ఏంటి? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్లలో చూడాల్సిందే.
👍🏻:-
- ఎప్పటిలాగే శ్రీవిష్ణు తన పాత్రతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నాడు. తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్విస్తాడు. మేఘ ఆకాష్ కూడా గ్లామర్ కానీ మరియు నటన పరంగా అలరిస్తుంది. సీరియస్ పాత్రలో సునైనా మేపిస్తుంది. రవి బాబు సినిమాని తన నటనతో ఇంకో మెట్టు పైకేకించారు.
- ఫస్ట్ హాఫ్ కామెడీ .
- గంగవ్వ కూడా తనదైన స్టైల్ లో అలరించింది.
- కథ , కధనం బావుంది.
- దర్శకుడు డెబ్యూ మూవీ తోనే హిట్ కొట్టేశాడు.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
” సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్.
*సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
👎🏻:-
- సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఎక్కువ ఉంది.
ముగింపు :- Raja Raja cienma Movie final Verdict
మొత్తానికి రాజ రాజ చోర అనే సినిమా శ్రీవిష్ణు కెర్రిర్ లోనే ది బెస్ట్ ఎంటర్టైనర్ గా నిలిచిపోతుంది. సినిమాలో నటించిన అందరు తమ పాత్రలకు న్యాయం చేశారు. శ్రీవిష్ణు పాత్రలో మునిగిపోయారు. రవి బాబు ఎనర్జీ లెవెల్స్ సూపర్. ఫస్ట్ హాఫ్ అంత కామెడీ గా నడిచిన సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా తీసుకొని వెళ్లి బ్యాలన్సుడ్ గా దర్శకత్వం చేశారు హర్షిత్. కొంచెం ల్యాగ్ ఉన్న శ్రీవిష్ణు కామెడీ తో గట్టెకించేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఈ వారం కుటుంబం అంత కలిసి తనివితీరా నవ్వుకోవాల్సిన సినిమా ఇది.
Rating:- 3.25/5