Tollywood news in telugu

Raj Tharun and Sandeep Madhav Multi Starrer Film : రాజ్ తరుణ్ సందీప్ మాధవ్ మల్టీ స్టారర్ సినిమా షురూ :-

Raj Tharun and Sandeep Madhav Multi Starrer Film

Raj Tharun and Sandeep Madhav Multi Starrer Film : రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. అతని సినిమాలకి , అతని స్క్రిప్ట్ సెలక్షన్ కి ప్రత్యేక అభిమానులు ఉంటారు. కొన్ని సార్లు సినిమా ప్లాప్ అయినా రాజ్ తరుణ్ పెర్ఫార్మన్స్ కి మాత్రం మంచి మార్కులే వేస్తారు అందరు. అలాంటి రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ , సినిమా పూర్తవకముందే ఇంకో సినిమా చేస్తూ లైఫ్ ఫుల్ బిజీగా లీడ్ చేస్తున్నారు.

ఇంకోపక్క సందీప్ మాధవ్ , ఈ పేరు ఎక్కడ విన్నటు లేకుంటే ఓసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి రాంగోపాల్ వర్మ దర్శకత్వం లో వచ్చిన వంగవీటి సినిమా మరియు జార్జ్ రెడ్డి సినిమా గుర్తుచేసుకోండి. హా ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన హీరోనే మన సందీప్ మాధవ్.

ఇతను కూడా స్క్రిప్ట్ సెలక్షన్ కి కేర్ అఫ్ అడ్రస్. సినిమాలు హిట్ అయ్యాయి అని వెంటవెంటనే సినిమాలు చేయకుండా మంచి కథ కోసం ఎదురు చూస్తారు.

ఇపుడు రాజ్ తరుణ్ మరియు సందీప్ మాధవ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాకి టైటిల్ గా మాస్ మహారాజు అని కూడా ఫిక్స్ చేసారు. ఈరోజు ఉదయం ఈ సినిమాకి సంబందించిన అధికారిక పూజ కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ సినిమా కి సుధీర్ రాజు దర్శకత్వం వహించగా అసిఫ్ జానీ నిర్మాత బాధ్యతలు స్వీకరించారు.

ఈ సినిమా ఒక డిఫరెంట్ మల్టీ స్టారర్ అని అంటున్నారు. చూడాలి మరి ఈ ఇద్దరు కలిసి ఏ రేంజ్ మల్టీ స్టారర్ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమవుతున్నారో.. ఇంకోపక్క రాజ్ తరుణ్ నటించిన స్టాండ్ అప్ రాహుల్ , అనుభవించు రాజా సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button