Tollywood news in telugu

రాజమౌళి శివగామి గా మల్లి రాబోతుంది?

తెలుగు సినిమా గొప్పతనాన్ని ఒక్క భారతదేశoలోనే కాకుండా ప్రపంచం మొత్తం గుర్తుండిపోయేలా చాటి చెప్పిన సినిమా బాహుబలి. ‘బాహుబలి-ది బిగినింగ్’, ‘బాహుబలి2- దికంక్లూజన్’ టైటిల్స్ తో రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల చేయగా ప్రపంచ వ్యాప్తంగా వేలాది కోట్లు వసూలు చేసింది. అంతగా ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ ని బాహుబలి బద్దలు కొట్టింది. తెలుగు సినిమా కలెక్షన్స్ గురించి చెప్పాలoటే ఇప్పుడు బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అన్నoతగా ఈ సినిమాని గొప్పగా తెరకెక్కించాడు జక్కన్న రాజమౌళి.

బాహుబలి సినిమాలో ఎన్ని పవర్ ఫుల్ పాత్రలు ఉన్న వాటిలో ముఖ్యంగా, మొదటగా చెప్పుకోవలసిన పాత్ర shivagaami. ఈ పాత్ర బాహుబలి సినిమాకి ప్రాణం లాంటిది అని చెప్పొచ్చు. అలాంటి శివగామిని పాత్రలో రమ్యకృష్ణ నటించింది అని అంటే తక్కువగా అనిపిస్తుంది, జీవించిందనే చెప్పాలి. ఆ పాత్రలో తనని తప్ప మరొకరిని ఊహించుకోలేము. నటన నభూతో నభవిష్యతి అనే విధంగా ఉన్నది.  ఆ పాత్రకు ఆమెను తప్ప  మరొకరిని ఊహించుకోలేము.  ఇప్పుడు అంత ముఖ్యమైన పాత్రను మెయిన్ హైలైట్ గా తీసుకొని, ‘రైజ్ ఆఫ్ శివగామిని’ అనే వెబ్ సీరీస్ ను నిర్మించబోతున్నారు. ఈ కథలో బాహుబలి,   భల్లాలదేవ ఉండరు.  shivagaami పాత్ర చుట్టూనే ఈ స్టొరీ అంతా సాగుతుంది. డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సీరీస్ ను నిర్మిస్తున్నది.

Read  పూరి జగన్నాథ్ ని కంటతడి పెట్టించిన వీడియో... వైరల్ !

ఆనందన్ నీలకంఠన్ రచించిన పుస్తకం “రైజ్ ఆఫ్ శివగామిని” ఆధారంగా ఈ సీరీస్ ను నిర్మిస్తున్నారు. దర్శకులు ప్రవీణ్ సత్తార్, దేవాకట్టాలు ఈ సీరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సిరీస్ ను నిర్మించేందుకు ఆర్కామీడియావర్క్స్, రాజమౌళితో కలిసి నెట్ ఫ్లిక్స్ సిద్ధమైంది. మొదటి సీజన్ లో 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒకేసారి 90 భాషలలో ఈ వెబ్ సీరిస్ ను రిలీజ్ చేస్తారని సమాచారం. రైజ్ ఆఫ్ shivagaami లో బుల్లితెర తార మృణాల్ ఠాగూర్ నటిస్తున్నది. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడనుంది. కుంకుం భాగ్య సీరియల్ లో బుల్ బుల్ పాత్ర తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మృణాల్ హృతిక్ రోషన్ సినిమా ‘సూపర్ 30’ లో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. మరి రమ్యకృష్ణ పోషించిన ఈ పాత్రలో ఈ బాలీవుడ్ బ్యూటీ తన విశ్వరూపం ఏమేరకు చూపిస్తుందో వేచి చూడాల్సిందే. అయితే అమరేoద్ర బాహుబలి పుట్టక ముందు జరిగిన కథ ఏమిటి? శివగామిదేవి ఎక్కడ పుట్టింది? ఎలా మాహిష్మతి రాజ్యానికి కోడలిగా వచ్చింది. అంత పెద్ద రాజ్యాన్ని తన కను సైగతో ఎలా కంట్రోల్ చేసింది అనే కథతో ఈ వెబ్ సిరీస్ రాబోతోంది.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.

Read  అల్లు అర్జున్ కూతురు అర్హ బర్త్ డే కి అదిరిపోయే గిఫ్ట్ !

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button