Tollywood news in telugu
rai laxmi : తన వెనుకనున్న విషాదాన్ని చెప్పుకొచ్చిన సినీ నటి రాయ్ లక్ష్మి… !

rai laxmi : రాయ్ లక్ష్మి కొంతకాలం క్రిందట కరోనా మహమ్మారి బారినపడిన విషయం తెలిసిందే, కానీ ఆ సమయంలో తాను ఎంతటి క్షోభను అనుభవించానో తనకు మాత్రమే తెలుసునంటుంది. ఇలా తన కుంటుంబంలో జరిగిన విషయాలను కూడా చెప్పుకొచ్చింది.
తన తండ్రి నోటి క్యాన్సర్ తో చనిపోయాక తాను ఒంటరినయ్యానన్న ఫీలింగ్ వచ్చిందని, నామీద నాకున్న కాన్ఫిడెంట్ తగ్గిపోయిందని వెల్లడించింది. అదేవిదంగా తనకి కరోనా సోకి ఐసోలేషన్ ఉన్నపుడు , నరకం అంటే ఏంటో చూశానని , కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసి ఎంతగానో కుంగిపోయానని వివరించింది.
దుబాయ్ లో ఒక డాన్స్ షోలో అవకాశం రావడంతో అక్కడికి వేళ్ళాను. తీరా వెళ్ళాక నీరసంగా ఉండటంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ వచ్చి 12 రోజులు నరకం చూడాల్సి వచ్చిందని , కొన్ని రోజులు పోయాక నెగెటివ్ రావడంతో ఇలా మళ్ళీ సమాజంలో తిరుగుతున్నానని తన పర్సనల్ విషయాలు తెలిపింది.