Political News

రాంగోపాల్ వర్మతో రఘురామకృష్ణరాజు ఫన్నీ వార్ణింగ్ ఫొటోలు…ఆ వార్ణింగ్ ఎవరికో !

Raghuram Krishnaraja Funny Warning

గోదావరి జిల్లాలలో వెటకారం మాటలు, ప్రత్యర్థుల విషయంలో మాట్లాడటం లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దిట్ట. అలాంటి వ్యక్తి సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మతో కలిసి కొన్ని ఫన్నీ ఫొటోస్ దిగాడు . 

వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫొటోలను వర్మ సోషల్ మీడియాలో  పంచుకున్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు పలు ఎక్స్ ప్రెషన్లను తన ముఖంలో పలించారు. సీరియస్ వార్నింగ్ ఇస్తున్నట్టు వర్మతో కలిసి దిగిన ఫొటోలు తెగ వైరల్ గా మారాయి.

వర్మ ఈ ఫొటోలో  ఆర్ఆర్ఆర్ (రఘురామకృష్ణరాజు) ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడో చెప్పగలరా అని ప్రశ్నించారు. తాను కూడా రఘురామకృష్ణరాజు పొలిటికల్ గాంగ్ లో చేరుతున్నానని తెలిపాడు . అంతేకాదు, ఆర్ఆర్ఆర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి, రామ్ చరణ్, రామారావు లు కేవలం సినిమా వరకే పరిమితం అని, కానీ, ఆర్ఆర్ఆర్ అంటే రఘురామకృష్ణరాజేనని, ఆయన రియల్ హీరో అని పేర్కొన్నాడు.  

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button