Radhe Shyam team made a check to the Rumours : పుకార్లకు చెక్ పెట్టిన రాధేశ్యామ్ చిత్ర బృందం :-

Radhe Shyam team made a check to the Rumours : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మచ్ అవైటెడ్ ఫిలిం రాధేశ్యామ్. ఈ సినిమా టీజర్ ప్రభాస్ అభిమానులకే కాకుండా , అని వర్గాల ప్రేక్షకులు విపరీతంగా నచ్చింది. అయితే ఈ సినిమా మొదటి నుంచి సంక్రాంతి 2022 లో విడుదల అని , జనవరి 14 న విడుదల చేయబోతున్నారని చిత్ర బృందం అధికారికంగా కొన్ని నెలల క్రితమే అనౌన్స్ చేశారు.
ఇదిలా ఉండగా ఇపుడు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా జనవరి లో సంక్రాంతి కి వస్తుంది అని పుకార్లు రేయడంతో సంక్రాంతి కి వచ్చే సినిమాలు అని సైడ్ అయిపోతున్నాయి అని ట్విట్టర్ లో ట్రెండ్ నడుస్తుంది. నిన్నటి నుంచి ట్విట్టర్ లో ఇదే చర్చ. ఆర్.ఆర్.ఆర్ వస్తుంది మిగితా సినిమాలు అన్ని తప్పుకోవాలి అని చర్చలు జరుగుతున్నాయి.
ఇంకా ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందం అధికారికంగా ఏ విషయం ప్రకటించకపోయినా , పుకార్లతోనే సంక్రాంతి కి విడుదల అయ్యే చిత్ర బృందాల మీద టెన్షన్ స్టార్ట్ అయ్యాయి అనుకుంట. ఈ వార్త వినగానే తగ్గేదెలా అంటూ ముందుగానే సంక్రాంతికి విడుదల అనౌన్స్ చేసిన సినిమాలు మరల నొక్కి మరి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నాయి.
రెండ్రోజుల క్రితం పవన్ కళ్యాణ్ , రానా నటించిన భీమ్లా నాయక్ సినిమా అనుకున్న తేదీకే జనవరి 12 న వస్తుంది అని మరల అధికారికంగా ప్రకటించగా. ఇపుడు ప్రభాస్ మచ్ అవైటెడ్ లవ్ స్టోరీ అయినా రాధేశ్యామ్ చిత్ర బృందం కూడా మరల ప్రేక్షకులకి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇదివరకే అనౌన్స్ చేసిన విడుదల తేదీనే , జనవరి 14 న ఈ సినిమా విడుదల అవుతుందని , విడుదల విషయం లో వెన్నకి తగ్గేదే లేదు అని చెప్పకనే చెప్పారు.
చూడాలి మరి ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందం అస్సలు విడుదల తేదిని అధికారికంగా ప్రకటించకపోయినా ఈ పుకార్లు రేయడం తో అన్ని సినిమాలు మరల విడుదల తేదిని నొక్కి మరి చెప్తున్నాయి. రాజమౌళి గారు ఈ విషయం పైన ఎలాంటి స్పందన తెలపబోతున్నారో. ఇంతకీ ఆర్.ఆర్.ఆర్ విడుదల తేదిని అధికారికంగా ఎపుడు ప్రకటిస్తారో చూడాలి.