Tollywood news in telugu

చేతి వృత్తుల కళాకారుల కథతో సినిమా

radhakrishna movie

ఈ రోజుల్లో కనుమరుగవుతున్న చేతి వృత్తులు ఆధారంగా చేసుకొని, ఇందులో ముక్యంగా నిర్మల్ బొమ్మల చేయువృత్తుల కథాంశంతో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాలో అనురాగ్, ముస్కాన్ సేథీ హీరో హీరోయిన్ లుగా అలాగే లక్ష్మీపార్వతి ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా టైటిల్ ‘రాధాకృష్ణ ‘ గా నిర్ణయించారు. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని పుప్పాల కృష్ణకుమార్ సాగ‌‌‌‌రిక నిర్మిస్తున్నారు.

అలాగే ఈ సినిమా ట్రైలర్ ని నిన్న ఆదివారం టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రసాద్ ల్యాబ్స్‌‌‌‌లో రిలీజ్ చేశాడు.

లక్ష్మీపార్వతి మాట్లాడుతూ క‌‌‌‌నుమ‌‌‌‌రుగైపోతున్న చేతి వృత్తుల క‌‌‌‌ళాకారుల్ని ప్రోత్సహించాల‌‌‌‌నే ఉద్దేశంతో చేస్తున్న సినిమాలో నేను చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేసింది.

ఒక మంచి కథాంశంతో వస్తున్న సినిమాను ప్రేక్షకులు తప్పకుండ ఆదరిస్తారని తెలిపారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button