Tollywood news in telugu

రథేరా మూవీ రివ్యూ & రేటింగ్ !!!


చిత్రం: రథేరా
నటీనటులు: సిద్దు, మానస,వై. ఎస్.కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, మారుతి సకరం, రమాదేవి, మంజు, నాని, రాజేష్,సాయి, జానీ, కార్తీక్
మ్యూజిక్: సిద్ధార్థ్
కెమెరా – ఎడిటర్ – కథ – స్క్రీన్ ప్లే – మాటలు -దర్శకత్వం: రమేష్ జాకట
నిర్మాతలు: సిద్దేశ్వర్ రావ్ , నరేష్ యాదవ్, వై.ఎస్.కృష్ణమూర్తి

పులా సిద్దేశ్వర్ రావ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం రథేరా, జాకట రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. పూల సిద్దేశ్వర్ రావ్, నరేష్ యాదవ్, వై.ఎస్.కృష్ణమూర్తి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
ఖోఖో నేపథ్యంలో నడిచే కథ ఇది. ఖోఖో ఆట మరుగున పడుతున్న సమయంలో ఆ ఆటను గుర్తు తెచ్చే కథాంశంగా ఈ సినిమా ప్రధాన నేపథ్యం. కడప జిల్లాలో లో ఉన్న ఒక గ్రామంలో వేద స్కూల్ లో పిల్లలు అంచెలంచెలుగా ఎదుగుతూ ఖోఖో ఆడి ఉరికి మంచి పేరు ఎలా తెచ్చి పెట్టారనేది తెకుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
పులా సిద్ధేశ్వర రావు హీరోగా మరియు నిర్మాతగా తన భాధ్యతను పూర్తిగా నిర్వర్తించారు. పెద్దయ్య అనే పాత్రలో సకారం అద్భుతంగా నటించాడు. అతని డైలాగ్స్ ఆడియన్స్ తో చప్పట్లు కొట్టిస్తాయి. కొన్ని కొన్ని సన్నివేశాల్లో అమీర్ ఖాన్ చేసిన దంగల్ చిత్రం గుర్తు వస్తుంది, లోకల్ ట్యాలెంట్ తో అందరూ కొత్తవారు చేసిన ఈ సినిమా ఎక్కడా బోర్ లేకుండా డైరెక్టర్ జాకట రమేష్ తెరకెక్కించాడు. తానే ఈ సినిమాకు కెమెరా, ఎడిటింగ్ చెయ్యడం విశేషం, అన్ని విభాగాలను చక్కగా హ్యాండిల్ చేసాడు.

నటీనటులు అయిన మంజు, హరీష్, రాజేష్, కార్తిక్, సాయి, జస్వంత్, రమాదేవి, వర్మ, శ్రీను, గిరి కొత్త వారైనప్పటికి అనుభవం కలిగిన నటీనటువలె నటించారు. నిర్మాతలు నరేష్ యాదవ్, కృష్ణమూర్తి ఈ చిత్రంలో నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు. హీరోయిన్ మానస తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.

స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఆడియన్స్ కు ఆసక్తిని కలిగిస్తాయి. అదే తరహాలో ఉంది ఈ రథేరా చిత్రం. ఎక్కడా బోరింగ్ లేకుండా, అనవసమైన పాత్రలు, పాత్రలు లేకుండా ఆసక్తిని రేకెత్తించే విధంగా ఈ సినిమా ఉంది. ఈ సినిమాకు మరో హైలెట్ రీరికార్డింగ్ అని చెప్పుకోవాలి. సిద్ధార్థ్ అందించిన ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు సినిమా చాలా రసవత్తరంగా ఉంది. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు అరుదుగా వస్తున్న ఈ సమయంలో రథేరా చిత్రాన్ని కుటుంభం అంతా కలిసి చూడొచ్చు.

రేటింగ్: 3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button