Queen of the Dark: అందం అంటే తెలుపు కాదు.. నా రంగంటే నాకు ఇష్టం

Queen of the Dark: సామాన్యంగా మనం తెల్లగా ఉండే వారినే ఎక్కువ ఇష్టపడతాను… అలాగే ప్రతి ఒక్కరూ తాము కూడా తెల్లగా ఉండాలని కోరుకుంటాం. నాకు నలుపు రంగు అంటే ఇష్టం..నేను నల్లగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానని ఏకంగా ఒక అమెరికన్ మోడల్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

సుడానీస్ సంతతికి చెందిన అమెరికన్ ఆఫ్రికన్ మోడల్ న్యాకిమ్ గాట్వేచ్ నలుపు అందం పై స్పందించారు. నల్లగా ఉన్న వారిని తెల్లగా మారేందుకు కొందరు అడ్డమైన సలహాలు చెప్తారని వాటిని పట్టించుకోవద్దని..నల్లగా పుట్టడం అదృష్టన్ని ఈ క్వీన్ ఆఫ్ థ డార్క్ చెపుతోంది. తాను నల్లగా పుట్టడం వల్ల వివక్ష కు గురయ్యానని..కానీ తనవి అవేవి పట్టించుకోకుండా మోడలింగ్ పై మక్కువతో తను అనుకున్నది సాధించానన్ని గాట్వెచ్ తెలిపారు.

ప్రస్తుతం ఈ డార్క్ బ్యూటీ అమెరికాలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. మీకు తెలియని మరో విషయం ఏమిటంటే గాట్వెచ్ మోడల్ ఏ కాదు…మహిళల హక్కుల కోసం పోరాడే న్యాయవాది కూడా…