viral : డ్రామాలు చాలు … ! విరాట్, అనుష్కలపై మండిపడుతున్న ప్రజలు !

తాజాగా విరాట్, అనుష్కలు ప్రజలకు ఇచ్చిన సందేశం పై నేటి జనులు ఫైర్ అవుతున్నారు. షోషల్ మీడియాలో వీరు చెప్పేవి శ్రీరంగ నీతులు, వారు చేసేవి ఏంటి మరి అని ప్రశ్నిస్తున్నారు.
ప్రజలు ఆగ్రహానికి గురికావడానికి కారణాలు పరిశీలిస్తే…
దీపావళి రోజు ప్రజలతో పాటు సెలబ్రిటీలు టపాసులు పేల్చి ఎంతో ఆనందంగా వారి కుటుంబసయులతో గడుపుతూ ఉంటారు. కొందరు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి వారి సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.
కానీ కోహ్లీ జంట మాత్రం ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజలందరూ పర్యావరాన్ని కాపాడాలని, టపాసులకు దూరంగా ఉంటె మంచిదని నీతులు చెప్పడంతో ఈ జంట ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.
వీరు చెప్పిన నీతులకు కౌంటర్ గా ప్రజలు సమాధానం చెప్తూ, డ్రామాలు చాలు మీకు అరడజను కార్లు ఉన్నాయ్, అలాగే మీకు స్పెషల్ గా ఒక జెట్ విమానం ఉంది. వాటి వల్ల కాలుష్యం కాదా అని కౌంటర్ ఇచ్చారు.