పుష్య మాసం సూర్యారాధన
pushyamasa visheshas
ఈరోజు యొక్క ఆరాధన విశేషాలు
ఈరోజు సూర్యోదయం వరకు మార్గశిర అమావాస్య ఉంది, తదుపరి పుష్య మాసం ప్రవేశం జరిగింది.ఈరోజు ఆదివారంతో కూడి యుంది. మన తెలుగు మాసాల్లో ఒక్కోనెలలో ఒక్కో దైవానికి విశిష్ట ఆరాధన జరుగుతుంది.
పుష్యమి నక్షత్రంతో కూడి పౌర్ణమి వచ్చే మాసానికి పుష్య మాసం అని పేరు కలదు. భాద్రపద మాసంలో గణపతిని, ఆశ్వీయుజములో అంబికను, కార్తీకం లో శివుణ్ణి, మార్గశిరం లో విష్ణువుని ఆరాధన చేస్తాం. ఇకపోతే పంచాయతనం లో ఉన్నటువంటి మిగిలిన దైవం అయిన సూర్యుని ఆరాధన చేయాలి.సూర్యుని ఈ మాసం అంతా ఉదయానికల్లా లేచి సూర్య నమస్కారములు చేయాలి.
జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే ఆయన ప్రాతినిధ్యం వహించే లోహం రాగి చెంబులో నేతిని నింపి దానం చేయాలి. సూర్యుడు ద్వాదశ ఆదిత్యుల రూపంలో ఉంటాడు కాబట్టి ఈ మాసము అంతా సూర్యునికి సంబంధించిన ఏదేని స్తోత్రం లేదా ఆదిత్య హృదయం ను కనీసం పన్నెండు మార్లు పఠనం చేయాలి. ఆదివారం నాడు నేతిని, ఉసిరిక ను ఆహారంలో నిషిద్దం చేయాలి. ఇవి చాలు మీకు ఈ మాసంలో. సంపూర్ణ ఆరోగ్య, ఐశ్వర్యప్రాప్తికి.
ఓం సూర్యాయ నమః