Tollywood news in telugu

విజయ్ దేవరకొండ తమ్ముడి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్…

Pushpaka Vimanam

ఇంతకముందు దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ, ఇపుడు తాజాగా  కామెడీ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు.  ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ను ఆనంద్ బ్రదర్  అగ్రహీరో విజయ్ దేవరకొండ ఇవాళ తన చేతులమీదుగా  రిలీజ్ చేశాడు. దామోదర అట్టాడ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి  పుష్పక విమానం అనే పేరును ఖరారు చేసారు.

ఈ సినిమాను కింగ్ ఆఫ్ ద హిల్, టాండా ప్రొడక్షన్స్ బ్యానర్లపై విజయ్, ప్రదీప్ ఎర్రబెల్లి, గోవర్ధన్ రావ్ దేవరకొండ ఈ మూవీని  నిర్మిస్తున్నారు. పుష్పక విమానం చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరసన ‘శాన్వీ మేఘన’, ‘గీతా సైనీ’ హీరోయిన్ లు గా నటిస్తున్నారు. అలాగే ఈ మూవీలో  సీనియర్ నటుడు సురేశ్, సునీల్ ఇతర ప్రధాన పాత్రల్లో కనపడనున్న. సినిమాకు  రామ్ మిరియాల, అమిత్ దాసాని, సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్నీ అందిస్తున్నారు.

Read  వీరిని నమ్మితే చావుకు దగ్గరైనట్టే
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button