Pushpaka Vimanam Review and Rating | హిట్టా ఫట్టా :-

Movie :- Pushpaka Vimanam (2021) Review
నటీనటులు :- ఆనంద్ దేవరకొండ , సాన్వే మేఘన , గీత్ సైని , సునీల్ , నరేష్ , కిరీటి మొదలగు.
నిర్మాతలు :- విజయ్ దేవరకొండ , గోవర్ధన్ రావ్ దేవరకొండ.
సంగీత దర్శకుడు :- రామ్ మిరియాల
డైరెక్టర్ :- దామోదర
ముఖ్య గమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.
Story ( Spoiler Free ) :-
ఈ కథ చిట్టిలంక సుందర్ ( ఆనంద్ దేవరకొండ ) యొక్క పెళ్ళి సన్నివేశాలతో మొదలవుతుంది. సుందర్ మీనాక్షి ( గీత సైని ) ని పెళ్ళి చేసుకున్న మరుసటిరోజే మీనాక్షి తన లవర్ తో పారిపోతుంది. ఈ విషయం ఎక్కడ బయటపడకూడదు అని సుందర్ అష్టకష్టాలు పడుతుంటాడు. అదేసమయంలో సుందర్ ఇంకా లాభం లేదు అందరికి తన భార్యని చూపించాలని ఒక ఆర్టిస్ట్ అయినా రేఖ ( శాన్వీ మేఘన ) ని రిక్వెస్ట్ చేయగా. సుందర్ భార్యగా నటించడానికి రేఖ ఒప్పుకుంటుంది.
ఇదిలా ఉండగా కొన్ని అనుకోని సంఘటనల చేత మీనాక్షి గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీస్ ఆఫర్ అయినా సునీల్ ఎంట్రీ తో ఇంటర్వెల్.
ఇంతకీ మీనాక్షి లవ్ లో ఉన్నపుడు ఎందుకు సుందర్ ని పెళ్లి చేసుకుంది ? సుందర్ ఎందుకు భార్య లేకున్నా ఉన్నట్లు నటించాల్సి వచ్చింది ? సుందర్ పడిన కష్టాలు ఏంటి ? ఇంతకీ రేఖ క్యారెక్టర్ ఏంటి ? అస్సలు మీనాక్షి కి ఎం జరిగింది ఎందుకు పోలీస్ ఆఫర్ సునీల్ రావాల్సి వచ్చింది ? ఈ క్రమం లో సుందర్ ఎదురుకున్న ఇబ్బందులు ఏంటి ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే.
Positives 👍🏻 :-
- ఆనంద్ దేవరకొండ , గీత సైనీ , శాన్వి మేఘన చాలా బాగా నటించారు. సినిమా అంతా విరి పెర్ఫార్మెన్స్ మీదనే రన్ అవుతుంది. ముగ్గురు మెచ్యూర్ గా ఎక్కడ ఎక్కువ తక్కువ చేయకుండా బాగా చేశారు. సునీల్ కూడా పోలీస్ ఆఫీసర్ గా బాగా అలరించారు.
- కథ బాగుంది.
- ఫస్ట్ హాఫ్ మొత్తం.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- సినిమాటోగ్రఫీ బాగుంది.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
Negatives 👎🏻:-
- ఫస్ట్ హాఫ్ బాగా తెరకెక్కించాకా రెండవ భాగం మొత్తం డల్ అయిపోయింది. పెద్దగా అలరించదు. రెండవ భాగం కాస్త ట్విస్ట్స్ మరియు గ్రిప్పింగ్ గా చేసింటే సినిమా ఇంకోలా ఉండేది.
- దర్శకత్వం కాస్త సెకండ్ హాఫ్ పైన శ్రద్ధ పెట్టాల్సింది.
- ఎడిటింగ్ ఇంకా బాగా చేయాల్సింది.
- ఎగ్జిక్యూషన్ బాలేదు.
Overall :-
మొత్తానికి పుష్పక విమానం అనే సినిమా కథ పరంగా నటీనటుల పరంగా చాలా బాగున్నప్పటికీ చివరికి వచ్చేసరికి ప్రేక్షకులని నిరాశ కలిగిస్తుంది. మొదటి భాగం ఎంత అలరించిన రెండవ భాగం అంతలా నిరాశ కలిగిస్తుంది. ఆనంద్ దేవరకొండ చాలా బాగా చేశారు. గీత సైనీ , శాన్వి కూడా.
కాకపోతే ఇక్కడ దర్శకుడు మొదటి భాగం మరియు కథ కొత్తగా రాసుకున్నారు అదే ఫ్లో రెండవ భాగం పైన పెట్టింటే సినిమా ఇంకోలా ఉండేది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా స్టైలిష్ గా ఉంది.
ఇక్కడ సెకండ్ హాఫ్ సరిగా లేకపోవడం తో యావరేజ్ టాక్ తో సినిమా వస్తుంది. ఆనంద్ దేవరకొండ మరియు మిగితా వారి పెర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాని ఓసారి చుసేయచు.
Rating:- 2.25/5