Pushpa the Rise to be postponed ? : పోస్ట్ పోన్ అవ్వబోతున్న పుష్ప పార్ట్ 1 ?:-

Pushpa the Rise to be postponed ? : అవును మీరు చదివింది నిజమే. ఎటు చుసిన పుష్ప పోస్ట్ పోన్ అవుతున్నట్లే కనిపిస్తుంది తప్ప , అనుకున్న టైం కి విడుదల కష్టమే అనిపిస్తుంది.
పుష్ప చిత్ర బృందం ఈ సినిమా ముందుగా క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరగడం తో క్రిస్మస్ కి ముందే అంటే డిసెంబర్ 17 న విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారు. కానీ ప్రస్తుతం సిట్యుయేషన్ బయట అస్సలు బాలేదు. షూటింగ్స్ కూడా అనుకున్నాది , అనుకున్నట్లు జరిగేలా లేదు.
ఒక పక్క గులాబీ తూఫాన్ వానలు , ఇంకోపక్క అందరికి జ్వరాలు , దగ్గులు. ఇవ్వని పరిగణంలోకి తీసుకుంటే పుష్ప అనుకున్న తేదీన రావడం కష్టమే. ఇంకా పుష్ప సినిమాలో పాటల చిత్రీకరణ మరియు కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది.
ముందుగా అయితే అక్టోబర్ ఎండింగ్ లోగ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రొమోషన్స్ చేస్తూ డిసెంబర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇపుడు ఉన్న పరిస్థితుల్లో 30 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయడం కష్టమే. చూడాలి మరి పుష్ప ది రైస్ అనుకున్నది అనుకున్నట్లు డిసెంబర్ 17 న రాబోతుందో లేదా త్వరలో చిత్ర బృందం కొత్త విడుదల తేదీ అధికారికంగా ప్రకటిస్తారో..