Pushpa The Rise Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

Movie :- Pushpa The Rise (2021) Review
నటీనటులు :- అల్లు అర్జున్, రష్మిక , సునీల్ , ఫహద్ ఫాసిల్ , అనసూయ మొదలగు
నిర్మాతలు :- నవీన్ యెర్నేని , వై. రవి శంకర్
సంగీత దర్శకుడు :- దేవిశ్రీ ప్రసాద్
దర్శకుడు :- సుకుమార్
Story ( Spoiler Free ) :-
ఈ కథ సుకుమార్ గారి స్టైల్ లో టైటిల్ పడి దాక్కో దాక్కొ మేక పాటతో పుష్పరాజ్ ( అల్లు అర్జున్ ) గ్రాండ్ ఎంట్రీ ఉంటుంది. వెంటనే ఫ్లాష్ బ్యాక్. కొండ రెడ్డి బ్రదర్స్ నీ పుష్ప పోలీసుల నుంచి కాపాడుతాడు. అలా వారి మధ్య నమ్మకం ఏర్పడి పుష్పరాజ్ కి శాండల్ వుడ్ స్మగ్లింగ్ లో పర్ట్నర్ గా తీసుకుంటారు. ఇంకో పక్క పుష్ప రాజ్ మరియు శ్రీవల్లి మధ్య లవ్ ట్రాక్. ఇలా లైఫ్ హ్యాపీ గా లీడ్ చేస్తున్న పుష్పరాజ్ కి మంగళం శ్రీను ( సునీల్ ) తో వైర్యం ఏర్పడుతుంది. ఇదిలా ఉండగా పుష్ప రాజ్ ఈ బిజినెస్ లో తనదే ఆధిపత్యం రావాలని నిర్ణయించుకొని తన సొంత రూల్స్ అండ్ డీలింగ్స్ చేయడం మొదలుపెట్టడం తో ఇంటర్వల్ కార్డ్ పడుతుంది.
అస్సలు పుష్పరాజ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? ఎందుకు ఇలా బిజినెస్ చేయాలని దారి మార్చుకున్నాడు ? తన బాల్యం ఎలాంటిది ? కొండ రెడ్డి బ్రదర్స్ కి ఎందుకు సపోర్ట్ గా నిలబడాడు ? పుష్పరాజ్ కి మంగళం శ్రీను మధ్య వైరం ఎలా ఏర్పడింది ? పుష్పరాజ్ ఎలా బిజినెస్ లో ఆధిపత్యం తెచ్చుకున్నాడు ? వీటన్నిటి మధ్య ఫాహడ్ ఫాజీల్ మరియు పుష్ప రాజ్ మధ్య సంఘర్షణ ఎపుడు మొదలవుతుంది ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
Positives 👍:-
- అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ పెర్ఫార్మెన్స్ ఆశ్చర్యంగా మరియు అద్భుతంగా ఉంది. అతని క్యారెక్టరైజేషన్, యాస అందరిని అలరిస్తుంది. మిగిలిన పాత్రదారులు వారివారి పాత్ర పరిధిలో బాగా చేశారు.
- దర్శకుడు సుకుమార్ కథను, మరియు ఫైట్స్ సన్నివేశాలను చక్కగా అందించారు.
- సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.
Negatives 👎:–
- సినిమా స్లో గా సాగుతుంది . ప్రేక్షకులకు బోర్ కొట్టించింది.
- ఫ్లాట్ నేరేషన్ మరియు VFX వర్క్.
- ఫహద్ ఫాసిల్ డబ్బింగ్ మరియు పెద్దగా ఆకట్టుకొని ఫాహాద్ మరియు బన్నీ సన్నివేశాలు.
Overall :-
అల్లుఅర్జున్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మరియు సుకుమార్ కథనం మినహా మిగిలినవన్నీ సినిమా లో పెద్దగా ఆకట్టుకోవు మరియు ప్రేక్షకులను ఎక్కువ సమయం బోర్‌గా కొట్టిస్తాయి. మిగిలిన పాత్రధారులు వారివారి పాత్ర పరిధిలో బాగా చేశారు.
ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి మరియు సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. VFX work మరియు ఫాహద్ యొక్క రోల్ బలహీనంగా ఉంది మరియు పెద్దగా ఆకట్టుకొదు.
అల్లు అర్జున్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ మరియు సుకుమార్ దర్శకత్వం కోసం ఈ సినిమాను ఓసారి చూడచ్చు.
Rating :- 2.5/5