Pushpa The Rise is all set to Roar : పుకార్లకు చెక్ పెట్టిన పుష్ప టీం :-

Pushpa The Rise is all set to Roar : టాలీవుడ్ లో మచ్ అవైటెడ్ పెద్ద సినిమాలలో ముందుగా ఉంటుంది బన్నీ- సుకుమార్ కలిసి చేసే పుష్ప సినిమా. ఎందుకంటే అన్ని పెద్ద సినిమాల కంటే ఈ సినిమానే థియేటర్ లలో ముందుగా విడుదల అవ్వబోతుంది కాబట్టి.
ఈ సినిమాలో బన్నీ నెవెర్ బిఫోర్ లుక్ మరియు దాక్కో దాక్కో మేక సాంగ్ ఈ సినిమాకి కావలసిన దానికంటే ఎక్కువనే హైప్ వచ్చింది.
ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా పుష్ప పార్ట్ 1 ది రైజ్ , అనుకున్న తేదీన విడుదల కాదు అని , షూటింగ్ చేయాల్సిన సన్నివేశాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి , దానికి తోడు బయట కండిషన్స్ బాలేదని, అనుకున్న తేదిలోపల షూటింగ్ పూర్తి చేయలేరని , విడుదల కచ్చితంగా వాయిదా పడుతుందని వార్తలు ఇండస్ట్రీ అంత మారుమ్రోగిపోయాయి.
ఇప్పుడు పుష్ప చిత్రబృందం ఈ పుకార్లకు చెక్ పెట్టాలని నిర్ణయించి అధికారికంగా పుష్ప పార్ట్ 1 విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్యాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు సిద్ధమైంది. త్వరలో ఈ సినిమాలోని శ్రీవల్లి అనే లవ్ సాంగ్ కూడా విడుదల చేయనున్నారు.
ఇటీవలే సోల్ అఫ్ పుష్పరాజ్ అదే రష్మిక పోస్టర్ వదలగా , దానికి కూడా ప్రేక్షకాదరణ చాల బాగా వచింది.
మొత్తానికి బన్నీ-సుకుమార్ చేసే పుష్ప పార్ట్ 1 సినిమా డిసెంబర్ 17 న దేశవ్యాప్తంగా విదుదల కానుంది. ఈ సినిమాలో విలన్ గా ఫహద్ ఫజిల్ నటిస్తున్నారు. చూడాలి మరి పుష్ప సినిమా సుకుమార్ స్టైల్ లో ప్రేక్షకులని ఏ రేంజ్ లో అలరించబోతుందో.