Pushpa has been Preponed : ప్రీపోన్ అయినా పుష్ప :-

Pushpa has been Preponed : అవును మీరు విన్నది నిజమే. ఎప్పటినుంచో పుష్ప పార్ట్ 1 ది రైస్ క్రిస్మస్ కి విడుదల అని , డిసెంబర్ 25 న విడుదల అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించేశారు.
అయితే ఈ డిసెంబర్ లోనే ఎన్నో సినిమాలు , దానికి తోడు మెగా ఫ్యామిలీ నుంచే 4 సినిమాలు రావడం తో పుష్ప ప్రీపోన్ చేశారని చిత్రసీమ లో టాక్ నడుస్తుంది.
అయితే డిసెంబర్ నెలలో మెగా స్టార్ చిరంజీవి మరియు రాంచరణ్ నటించిన ఆచార్య , సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ , వరుణ్ తేజ్ ఘని , బన్నీ పుష్ప. ఇలా ఒక డిసెంబర్ లోనే ఈ పెద్ద సినిమాలు రావడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకా విజయ్ దేవరకొండ లైగర్ , వరుణ్ తేజ్ మరియు వెంకీ మామ చేసిన F౩. ఇలా తెలిసిన సినిమాల లిస్ట్ ఏ ఇంత ఉంది. తెలియని సినిమాలు ఇంకెన్నో .
కొని పెద్ద సినిమాలు ఇంకా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించలేదు. ఇవ్వని దృష్టిలో పెట్టుకొని పుష్ప పార్ట్ 1 డిసెంబర్ 25 న కాకుండా ప్రీపోన్ చేసి డిసెంబర్ 17 న విడుదల చేయాలనీ చిత్ర బృందం అనుకుంటున్నారు. డిసెంబర్ నెలలో ఒకోవారం ఒకో మెగా సినిమా విడుదల అవ్వాలని ఆలోచిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారం లో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ , రెండవ వారంలో వరుణ్ తేజ్ ఘని , మూడవ వారం లో బన్నీ పుష్ప , నాలుగవ వారం లో మెగా స్టార్ ఆచార్య.
ఇలా విడుదల చేయాలనీ అనుకుంటున్నారు. చూడాలి మరి పుష్ప ప్రీపోన్ అయినట్లు మిగితా సినిమాలు కూడా ప్రీపోన్ అవుతాయేమో.