Today Telugu News Updates

పురాణ పూల్ వంతెన దగ్గర వరదకి కొట్టుకు వచ్చిన పెద్ద పైథాన్ !

హైదరాబాద్ లో వర్షానికి జనం అతలాకుతలం అయారు , కొందరు ప్రాణాలు కోల్పోయారు , లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి , కార్ లు కొట్టుకుపోవడం , జనాలు కొట్టుకుపోవడం ఇలా ఎన్నో బాధలు పడుతున్న జనానికి పాముల బెడద కుడా మోపయింది , ఇక పురాణ పూల్ వంతెన దగ్గర ఒక పైథాన్ కనిపించి కెమెరా కంటికి సైతం చిక్కింది , అది కుడా పెద్ద సైజు ఉండటం , జనావాసాలకు దగ్గరగా ఉండటం, జనం సంచరించే ప్రాంతమయి ఉండటం ఇవన్నీ కలవరపెడుతున్నాయి ఈ హైద్రాబాదీలను .

అయితే ఈ బాధ ఇప్పట్లో తప్పేలా లేదు ఎందుకంటే మరిన్ని రోజులు జోరుగా వర్షాలు పడనున్నాయి , ఇక ముందు ముందు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో అగమ్య గోచరంగా కనబడుతుంది , ఇప్పటికె కరువు ప్రాంతాలు గా మారిన ఏరియాలు మరింత ప్రమాదకరంగా మారె అవకాశాలు లేకపోలేదు . హైదరాబాద్ ని వర్షాలు ముంచినపుడే స్పందించే గోవేర్నమేంట్ వర్షాలు లేని రోజున హైదరాబాద్ మురికి కాలువలని బాగు చేసే ఆలోచన లేకపోవటం బాధాకరం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button