Tollywood news in telugu

పూజ హెగ్డే పారితోషికం ఫిగర్ తెలిస్తే… ఫ్రీజ్ ఐ పోవాల్సిందే… !

టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర కథానాయికగా ఎదిగిన హీరోయిన్ పూజ హెగ్డే.. ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది ఇండస్ట్రీ లలో హీరోయిన్ గా నటిస్తూ  బిజీగా గడుపుతుంది. పాత సామెత ఒకటి పూజ కు ఒంటపట్టినట్టుంది. అదేంటంటే  దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో రెమ్యునరేషన్ ఈ ముద్దుగుమ్మ సినిమా సినిమాకు పెంచేస్తోంది.

 తాజాగా తమిళంలో ఓ సినిమాకి ఆమె తీసుకుంటున్న పారితోషికం  తెలిసిన ముక్కున వేలేసుకుంటున్నారు. పూజా మొదట్లో  ‘ముగమూడి’ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మళ్లీ ఇప్పుడు స్టార్ హీరో విజయ్ సరసన కథానాయికగా నటించడానికి సిద్ధమైనట్టు  తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ తన 65వ చిత్రాన్ని  చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాయొక్క  ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుగుతున్నాయి. 

ఈ మూవీలో హీరోయిన్ గా  పూజ హెగ్డేను తీసుకున్నారని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి పూజా 3 కోట్లు పైనే తీసుకోబోతుందని తెలుస్తుంది. ఇక పూజ డిమాండుకి నిర్మాతలు ఒప్పుకోక తప్పట్లేదు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button