News
ప్రియురాలి కోసం తిరిగి రాని లోకాలకి చేరుకున్న హబ్సిగుడ కి చెందిన ప్రణయ్ !

ఒక అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తే , అమ్మాయి లు చనిపోవడం విన్నాం. అమ్మాయిల మనసులు మాత్రమే సెన్సిటివ్ గా ఉంటాయి అనుకుంటాం , కానీ ఇక్కడ హైదరాబాద్ అబ్సిగూడ కు చెందిన పుచ్చకాయలు ప్రణయ్ కెనడాలో ఒక ప్రియురాలు మోసం చేసిందని నైట్రోజన్ గ్యాస్ పీల్చి చనిపోయాడు.
ప్రణయ్ సుసైడ్ నోట్ లో తన ప్రేమకు సంబదించిన వివరాలను చేర్చి మరి చనిపోయాడు, ఆ వివరాలు మాత్రం అధికారులు వెల్లడించలేదు. తన అవయవాలను దానం చేయాలనీ, అలాగే తన దేహాన్ని ల్యాబ్ లో ఉపయోగించుకోవాలని తన నోట్ లో పేర్కొన్నాడు.
ఇతని మరణ వార్తను హబ్సిగూడలోని ప్రణయ్ తల్లిదండ్రులకు దౌత్య అధికారులు తెలుపగా ప్రణయ్ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.