Tollywood news in telugu
ఓ వైపు కరోనా…మరోవైపు ముద్దులతో నిరసన… ఇందుకోసమేనట !
ఒకవైపు ప్రపంచం కరోనా తో గజగజలాడుతూ ఉంటె , ప్రభుత్వాలు చెప్పే మాటలను బేఖాతరు చేస్తూ ప్రజలు గుంపులు గుంపులు గా తిరుగుతూ , అంతే కాకుండా ముద్దులు పెట్టుకుంటూ కనీస జాగ్రత్తలు కూడా పాటించడంలేదు.

ఈ ముద్దులు పెట్టుకొనే కార్యక్రమం మనదగ్గర కాదండీ.. రష్యాలో జరిగింది. అక్కడ ఒక మెట్రో రైల్లో కొన్ని జంటలు ముద్దులు పెట్టుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసారు.
ఈ సంఘటన ఈ నెల 24 న రష్యా లోని ఒక మెట్రో రైల్ బోగీలో జరిగింది. దీనికి గల కారణం నైట్ క్లబ్బులు తెరవాలంటూ ఈ యువ జంటలు ముద్దులతో నిరసనను తెలిపారు.
మరి ఈ నిరసనల ఫలితం ఎలా ఉండనుందో చూడాలి .