priya prakash varrier viral video : హీరో నితిన్ వీపుపైకి ఎగిరే సమయంలో కిందపడిపోయిన ప్రియా ప్రకాశ్.. ఫన్నీ వైరల్ వీడియో మీకోసం..!

priya prakash varrier viral video : ఒక్క కన్ను గీటుతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేకెత్తించిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్స్.. ఈ కేరళ కుట్టి ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న ‘చెక్’ సినిమాలో నటించి , టాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసింది. మన టాలీవుడ్ లో పునాదులు గట్టిగ వేసుకోవాలని ప్రయత్నిస్తుంది.
ఈ సినిమా ని చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇక ఈ షూటింగ్ సందర్భంలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఈ విషయాన్నీ తన అభిమానులతో షేర్ చేసింది ప్రియా ప్రకాష్.
షూటింగ్ లో భాగంగా, నితిన్ పరిగెత్తుకుంటూ వచ్చి అలసిపోయి ఒక చోట ఆగుతాడు. ఆ సమయంలో వెనుక నుంచి పరిగెత్తుకుని వచ్చే ప్రియా ప్రకాశ్, ఎగిరి, వీపుపైకి ఎక్కాల్సి ఉండగా , పట్టు తప్పి పడిపోయింది.
ప్రియ, వెల్లకిలా నేలపై పడగానే , పక్కనే ఉన్న సిబ్బంది వచ్చి ఆమె పైకి లేపేందుకు సహాయం చేసే సమయంలో , తనకేమీ కాలేదన్నట్టుగా ‘థంబ్’ వేలిని చూపించింది. ఇపుడు ఈ వీడియో వైరల్ గా మారింది.