ప్రియ ప్రకాష్ చేసిన ఈ పనికి ఏకి పారేస్తున్న నెటిజన్స్

priya prakash varrier : ప్రియా వారియర్ తెలియనివారంటూ ఎవరు ఉండరేమో.. ఎందుకంటే తన ఒక కన్ను గీటుతో, దేశం లోని యువతలో హీటు పెంచింది. అలా అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న ప్రియా ఇపుడు అదే అభిమానుల తిట్లకు బలి అవుతుంది.

ఎందుకంటే ప్రియా నటించిన ‘ఓరు ఆదార్ లవ్’ సినిమాలో నటించినా ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో, తను కుమిలిపోకుండా తన గ్లామర్ తో ప్రజలని ఆకర్షిస్తుంది.
ఈ నటి తాజాగా గ్లామర్ డోస్ ని పెంచుతూ, తన షోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఈ పోస్ట్ లను చుసిన తన అభిమానులు ప్రియా పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. చేతిలో సినిమాలు లేనంతమాత్రాన ఇలా దిగజారడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రియా కు అసభ్యకర కామెంట్లు చేసిన పోస్ట్ లను తన షోషల్ మీడియాలో పెట్టింది. ఇలాంటి వారిని నేను చాల మందిని చూసాను, ఇలాంటి వాటికీ బయపడి నాకు వచ్చే అవకాశాలను వదులుకోను అని ఘాటుగా సమాధానం చెప్పింది.

నాకు బెదిరింపు కామెంట్స్, అలాగే లవ్ కామెంట్స్ కూడా వస్తూవుంటాయి. ఈ లాంటి వాటిని నేను తట్టుకోకుంటే, ఇండస్ట్రీలో ఎదగలేము అని ప్రియా వారియర్స్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.