Tollywood news in telugu

ఇచ్చట ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ అద్దెకు ఇవ్వబడును

నేడు మార్కెట్ లో వారానికో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవుతుంది. పెద్ద పెద్ద బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ వాటి లేటెస్ట్ టెక్నాలజీ మోడల్స్ ధరలు చాలా అధికంగా ఉంటున్నాయి. మార్కెట్ లోకి వచ్చిన ప్రతి లేటెస్ట్ మోడల్ ని యూస్ చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాని వాస్తవంలో అలా జరగడం చాలా కష్టం. వచ్చిన ప్రతి న్యూ స్మార్ట్ ఫోన్ ఇకపై మీరు కొనాల్సిన అవసరం లేకుండానే మీరు అన్ని లేటెస్ట్ మోడల్స్ మొబైల్స్ ని ఇప్పుడు యూస్ చెయ్యొచ్చు. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? కానీ ఇది సాధ్యమే. మీరు ప్రతి స్మార్ట్ ఫోన్ ని కొనకండి. రెంట్ కి తీసుకోండి అంటున్నారు.

హోమ్ గ్రోన్ ఫర్నిచర్ రెంటల్ సర్వీస్ Rentomojo దాని పోర్టల్ ద్వారా రెంట్ కి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ ని అందించడానికి ఒక కొత్త స్టెప్ తీసుకుంది. రెంట్ మోజో ఎలక్ట్రానిక్స్ సెక్షన్ నుండి, కంపెనీ నెలకు అతి తక్కువ అంటే రూ .399 రెంటల్ తో స్మార్ట్ ఫోన్లు మరియు స్మార్ట్ డివైసెస్ ని అందిస్తోంది.

Read  అందాల అనసూయా....

ప్రస్తుతం ఆఫర్ లో ఉన్న డివైసెస్ ప్రీమియం ఆపిల్ ఐఫోన్ X 64GB నెలకి రూ.4,299 కి అద్దె ధరతో రూ.9,998 రీఫన్డబుల్ అమౌంట్ తో లభిస్తుంది. ఒక ప్రీమియం ఫోన్ కోసం మీరు మొదటి నెల చెల్లించే మొత్తం రూ. 15,000 కన్నా తక్కువగా ఉంటుంది.

ఇప్పుడు, ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకటి మీరు 24 నెలలు రెంట్ తర్వాత కూడా, మీరు కోరుకుంటే, ఆ స్మార్ట్ ఫోన్ ని మీ సొంతం చేసుకోవచ్చు. రూ. 15,556 వ్యయంతో ఐఫోన్ X అందుబాటులో ఉంది. ఐఫోన్ X కి అత్యధిక రెంట్ కి లభించే ఫోన్, గూగుల్ పిక్సెల్ 2 నెలకు 2,099 రూపాయల రెంట్ కి చీప్ గా లభిస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ S9, శామ్సంగ్ నోట్ 8, ఆపిల్ ఐఫోన్ 8 మరియు గూగుల్ హోమ్ స్మార్ట్ స్పీకర్ కూడా ఈ rent mojo లో రెంట్ కి దొరుకుతున్నాయి.

సో మీరు ఇక ముందు మార్కెట్ లోకి వచ్చిన ప్రతి కొత్త ఫోన్ ని ట్రై చేయలేకపోయానే అని ఫీల్ అవ్వక్కర్లేదు. రెంట్ మోజో ద్వారా మీకు కావల్సిన ప్రీమియర్ ఫోన్స్ ని రెంట్ కి తీసుకోండి. ఎంజాయ్ చేయండి.

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button