News
డ్రగ్స్ కి బానిసైన…మరొక అందాల తార…

preethi chauhan హీరో సుశాంత్ ఆత్మహత్య తరవాత తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఒకరి తరవాత ఒకరు డ్రగ్స్ కేసులో బయటపడుతూనే ఉన్నారు. ఎంత దారుణంగా సినీ ఇండస్ట్రీ వాళ్ళు డ్రగ్స్ కి బానిసవుతున్నారో ప్రజలకు తెలుస్తుంది.
ప్రముఖ హిందీ సీరియల్ నటి ప్రీతిక చౌహన్ (30) ఈ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం తన అభిమానులను షాక్ కి గురి చేసింది. ఈ నటి తో పాటు మరో నలుగురు వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యారు.
ప్రీతిక తన ఫ్రెండ్స్ ముంబైలోని మచ్ఛిమార్ కాలనీ పరిధిలో జరుగుతున్నా హంజాయ్ దందాలో సంబంధాలు ఉండటంతో తనని నవంబర్ 8 వరకు కస్టడీ లో ఉంచారు.
ప్రీతిక 2016 లో సినిమాల పై ఉన్న మక్కువతో హిమాచల్ ప్రదేశ్ నుండి ముంబై కి వచ్చింది. తాను హిందీ సీరియల్స్ సంతోషి దేవి, సావ్ దాన్ , తదితర సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.