News
ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల 7 రోజుల పాటు….

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి మృతిపట్ల ఏడు రోజులపాటు సంతాపదినాలుగా ప్రకటించింది.
ఈ నెల 10న అనారోగ్యంతో ప్రణబ్ ముఖర్జీ ఈ నెల మొదటివారంలో ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ముఖర్జీ చేరారు.
మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆర్మీ ఆర్‌ఆర్ డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. కరోనా కూడా రావడంతో ప్రణబ్ ముఖర్జీకి చికిత్స అందిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది.
ప్రణబ్ ముఖర్జీకి మంగళవారం ఢిల్లీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక గౌరవ వందనంతో ఆయనకు తుది వీడ్కోలు పలకనున్నారు.
ఈ రోజునుండి అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో 7 రోజులపాటూ సంతాపం పాటించాలని, జాతీయ జెండాను అవనతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది.