Prakash Raj remarries : కొడుకు కోరికమేరకు మళ్ళీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్

Prakash Raj remarries : ప్రకాష్ రాజ్ అంటే తెలియని మనిషి ఉండడు. టాలీవుడ్ లో, బాలీవుడ్ లో, కోలీవుడ్ లో ఇలా భాషకు సంబంధం లేకుండా తనదైన నటనతో ప్రజలని మెప్పిస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవలే మా ఎలక్షన్స్ లో కూడా పొట్టి చేస్తున్నారు.
అయితే ప్రకాష్ రాజ్ మొదటి భార్య అయినా లలిత కుమారి కి 2009 లో విడాకులు ఇచ్చి 2010 లో ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినా పోనీ వర్మ ని వివాహమాడిన విషయం తెలిసిందే. వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అతని పేరే వేదాంత్.
2010 లో పెళ్ళిచేసుకున్నరు ప్రకాష్ రాజ్ మరియు పోనీ వర్మ. బాబు పుట్టాక వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చి దూరం అయ్యారు. అంతే కానీ విడాకులు తీసుకోలేదు. అయితే ఇటీవలే వేదాంత్ కోరిక మేరకు ప్రకాష్ రాజ్ మరియు పోనీ వర్మ మళ్ళి ఒక్కటయ్యారని ట్విట్టర్ లో పోస్ట్ ద్వారా ప్రజముఖంగా వెల్లడించారు.
కొడుకు కోరిక మేరకు మేము మళ్ళి పెళ్లిచేసుకున్నాం అని చెప్పకనే చెప్పేసి హ్యాపీ మూమెంట్స్ ఫొటోస్ రూపంలో చూపించారు. ఏదేమైనా మళ్ళీ ప్రకాష్ రాజ్ పెళ్లి చేసుకునే ఫొటోస్ చూసి నెటిజనులు షాక్ అయ్యారు. చూడాలి మరి ముందు ముందు ఇంకెన్ని షాక్స్ ఇయ్యబోతున్నరో ప్రకాష్ రాజ్ .