Prabhudeva sudden Entry Makes Naga Shourya and Akash Puri shock : నాగ శౌర్య మరియు ఆకాష్ పూరి కి షాక్ ఇచ్చిన ప్రభుదేవా :-

Prabhudeva sudden Entry Makes Naga Shourya and Akash Puri shock : అవును మీరు చదివింది మేము చెప్పింది నిజమే. ఇన్నిరోజులుగా నాగ శౌర్య మరియు ఆకాష్ పూరి ప్రొమోషన్స్ కోసం చేసిన హుంగామ అంత ప్రభుదేవా ఖాతాలో పడే ఛాన్సెస్ ఉన్నాయి అని ఇదివరకే తెలిసింది. ఎం అర్ధం అవ్వడం లేదు కదా.
మ్యాటర్ లోకి వెళ్తే ఈ నెల 29 న నాగ శౌర్య మరియు ఆకాష్ పూరి బాక్స్ ఆఫీస్ వద్ద వారి సినిమాలతో క్లాష్ జరగబోతుంది అన్న విషయం అందరికి తెలిసిందే. ఒక పక్క నాగ శౌర్య వరుడు కావలెను సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తో 29 న ప్రేక్షకుల ముందుకు రాగ , ఇంకో పక్క ఆకాష్ పూరి రొమాంటిక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
రొమాంటిక్ సినిమా కోసం యూత్ మరియు మాస్ ఆడియన్స్ , పూరి జగన్నాధ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కూడా 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ జరుగుతుంది అని తెలిసిన రెండు సినిమాలు పోటాపోటీగా విడుదలకు సిద్ధం అయ్యాయి.
అయిందేదో అయింది ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకి జనాలు పోతారులే అని అందరు అనుకోని సైలెంట్ గా ఉండిపోయేసరికి ఇప్పుడు సడన్ గా ప్రభుదేవా వచ్చి ఈ రెండు చిత్రబృందాలకు షాక్ ఇచ్చారు.
అదేంటంటే ప్రభుదేవా , ఆదా శర్మ , నిక్కీ గార్లని కలిసి నటించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనెర్ చార్లీ చాప్లిన్ 2 , ఈ సినిమా తమిళ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు లో మిస్టర్ ప్రేమికుడు అనే టైటిల్ పెట్టుకొని డబ్బింగ్ చేసి 29 న విడుదలకు సర్వం సిద్ధం చేసారు.
తెలుగు లో ప్రభుదేవా కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందని కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇపుడు 29 న జనాలు వరుడు కావలెను సినిమాకి పోతారా , ఆకాష్ పూరి రొమాంటిక్ కి పోతారా , లేదా ప్రభుదేవా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అయినా మిస్టర్ ప్రేమికుడికి పోతారనేది ప్రశ్నార్ధకంగా మారింది.
చూడాలి మరి ఈ 3 సినిమాలలో ఏ సినిమాకి జనాదరణ ఎక్కువ ఉండి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో వేచి చూడక తప్పదు.