Tollywood news in telugu

Prabhas Nag Ashwin casting call: ప్రభాస్ మూవీలో నటించాలని అనుకుంటున్నారా….అర్హతలేంటో తెలుసుకోండి …!

Prabhas Nag Ashwin casting call

ప్రభాస్ సినిమలో నటించాలని ఎవరికిమాత్రం ఉండదు. ఈ హీరో తో నటిస్తే వారి పేరు కూడా అమాంతం ప్రపంచమంతటా పాకుతుంది. జూనియర్, సీనియర్ ఆర్టిస్టులు కూడా ప్రభాస్ తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

ప్రశాంత్ నీల్  ఇప్పటికే సలార్ కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చాడు . ఇలా కాల్ ఇచ్చారోలేదో ఆ  కాల్‌కు వేలల్లో ఆసక్తి ఉన్న వాళ్లు వచ్చారు. ఆలా వచ్చినవారు వారి  టాలెంట్ చూపించి  ప్రభాస్‌తో పాటు స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కూడా దక్కించుకున్నారు.

ఇపుడు తాజాగా దర్శకుడు  నాగ్ అశ్విన్ సినిమాలో కూడా కొందరు కొత్త వాళ్లు అవసరం ఉండటంతో,  కాస్టింగ్ కాల్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను వైజయంతి బ్యానర్‌పై దాదాపు 300 కోట్లతో నిర్మించబోతున్నాడు సీనియర్ నిర్మాత అశ్వినీదత్. ఈ సినిమాకోసం దర్శకుడు నాగ్ అశ్విన్ మూడేళ్లుగా ఈ స్క్రిప్ట్‌పై వర్క్ చేశారట. ఈ సినిమాలకు సంబదించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే .. ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేయాలంటే 9 నుంచి 14 సంవ‌త్స‌రాల అమ్మాయిల‌‌కు డ్యాన్స్‌ల‌తో పాటు జిమ్మాస్టిక్స్ కూడా తెలిసి ఉండాల‌ని, అలాగే 20-35 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న పురుషుల‌కు డ్యాన్సింగ్‌, మార్ష‌ల్స్ ఆర్ట్స్‌పై ప‌ట్టు ఉండాల‌ని చెప్పారు.

పై అర్హతలు ఉన్నవాళ్లు ప్రభాస్‌తో నటించాలంటే  VYMTALENT@GMAIL.COM కు మీ వీడియోలు పంపించాలని  వైజయంతి టీం తెలిపింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button