Prabhas Mythological film release date Fixed : ప్రభాస్ మైథలాజికల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ :-

Prabhas Mythological film release date Fixed : హెడ్డింగ్ చదవగానే మీ మైండ్ లో ఏవేవో ఆలోచనలు వచ్చేసింటాయి. కంగారు పడకండి మేము చెప్పేస్తాం. ప్రభాస్ రెండు మైథలాజికల్ సినిమాలు చేస్తున్నట్లు తెలిసాయి. అందులో ఒకటి ఇదివరకే షూటింగ్ ప్రారంభం అయినా బాలీవుడ్ ప్రాజెక్ట్ ఆదిపురుష్. మరొకటి ప్రశాంత్ నీల్ తోనే ఇండియా లోనే నెవెర్ బిఫోర్ మైథలాజికల్ ఫిలిం అని వార్తలు విపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఇదివరకే ప్రభాస్ ఓం రావట్ దర్శకత్వం లో చేస్తున్న ప్యాన్ ఇండియా అనిమేషన్ ౩డి ప్రాజెక్ట్ ఆదిపురుష్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిలా కనిపించబోతున్నారు. రావణుడిగా సైఫ్ అలీఖాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటినుంచి చిత్ర బృందానికి కష్టాలే ఎదురవుతున్నాయి. భారీగా వేసిన షూటింగ్ సెట్ అంత ఫైర్ లో కాలిపోవడం. ఇలా ఎన్నో చేదు అనుభవాలే ఎదురయ్యాయి.
అయితే ఈరోజు ఈ చిత్ర బృందం ఎవరు ఊహించని విధంగా సినిమాకి సంబందించిన అప్ డేట్ ఇచ్చారు. అదేంటో కాదండి ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.
మొత్తానికి ప్రభాస్ ప్యాన్ ఇండియా యానిమేషన్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ వచ్చే సంవత్సరం ఆగష్టు 11 న విడుదల అవుతుందని అధికార ప్రకటన జరిగింది. ఈ వార్త విన్న అభిమానులు ట్విట్టర్ లో చిత్ర బృందం ని ట్యాగ్ చేస్తూ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దీనితోపాటు వచ్చే ఏడాది మొదట్లో ప్రభాస్ రాధే శ్యామ్ విడుదల కానుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రశాంత్ నీల్ సలార్ కూడా వస్తుంది. అలాగే ఆగష్టు లో ఆదిపురుష్ రావడం తో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేదు. ఒకే సంవత్సరం లో ప్రభాస్ మూడు సినిమాలు రావడం కూడా ఇదే మొదటి సారి. చూడాలి మరి ప్రభాస్ ఏ రేంజ్ హుంగామ చేయబోతున్నారో.