Prabhas Land Mark Film Updates on the way : ప్రభాస్ 25 వ సినిమా వివరాలు వచ్చేస్తున్నాయి :-

Prabhas Land Mark Film Updates on the way : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా దేశమంతటా టాలీవుడ్ అంటే ఏంటో , తెలుగు సినిమా పవర్ అంటే ఏంటో సత్తా చాటిన హీరో. బాహుబలి తర్వాత సాహో లాంటి స్టైలిష్ సినిమా తీసి ప్లాప్ టాక్ తోనే రికార్డు కొట్టిన హీరో.
అలాంటి ప్రభాస్ ఇపుడు వరుసబెట్టి సినిమా లతో యమా బిజీ బిజీ గా కాలం గడుపుతున్నారు. ఒక సినిమా పూర్తవకముందే ఇంకో సినిమా అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కి ఖుషి చేస్తున్నారు.
అయితే ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం చేశారు. ఈ సినిమా జనవరి 14 న దేశవ్యాప్తంగా విడుదలకి సిద్ధం అయింది. ఇదిలా ఉండగా ప్రభాస్ ఆది పురుష , సాలార్ సినిమాలతో బిజీ అయిపోగా , ఈ సినిమాలు కూడా వచ్చే ఏడాదే విడుదల కాబోతున్నాయి.
వీటన్నిట్లో ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూసే సినిమా ప్రాజెక్ట్ కే . ఈ సినిమాని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా ఇండియా’స్ ఫస్ట్ సైంటిఫికల్ ఫిలిం గా గుర్తుండిపోయేలా భారీ లెవెల్ లో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
మొత్తానికి ఈ 4 సినిమాల తర్వాత ప్రభాస్ ల్యాండ్ మార్క్ సినిమా అదే ప్రభాస్ 25 వ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ప్రభాస్ 25 వ సినిమా కెరీర్ లోనే ది బెస్ట్ ఉండాలనే అందరు కోరుకుంటారు. ఎందుకంటే అది ప్రభాస్ ల్యాండ్ మార్క్ సినిమా.
మ్యాటర్ లోకి వెళ్తే ప్రభాస్ ల్యాండ్ మార్క్ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ఉండబోతుందని చిత్రసీమ లో టాక్ నడుస్తుంది. ఇది కాకపోయినా దిల్ రాజు బ్యానర్ లో ఆల్రెడీ ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నారని కమిట్ అయినా విషయం తెలిసిందే. ఈ రెండిట్లోనే ప్రభాస్ ల్యాండ్ మార్క్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ప్రభాస్ 25 వ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన అక్టోబర్ 7 న ప్రభాస్ స్వయంగా వెల్లడించబోతున్నారని తెలుస్తుంది. చూడాలి మరి ప్రభాస్ 25 వ సినిమా ఏ దర్శకుడుతో ఉండబోతుందో , ఎలా ఉండబోతుందో. అక్టోబర్ 7 న దీని పైన స్పష్టత రాబోతుంది.