Prabhas heaps praise on Mathu Vadalara; special chit-chat video to be out soon
మత్తువదలరా చిత్రాన్ని అభినందించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్
ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా, మరో తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైన చిత్రం మత్తు వదలరా. మైత్రీ మూవీస్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చెర్రి, హేమలత ఈ చిత్రాన్ని నిర్మించారు. రితేష్‌రానా దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలతో విజయపథంలో దూసుకెళ్తుతోంది. నవ్యమైన కథ,కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది అత్యుత్తమ చిత్రాల్లో స్థానం సంపాందించుకుంది. కాగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన యంగ్ రెబల్‌స్టార్ పాన్ ఇండియా కథానాయకుడు ప్రభాస్ ప్రత్యేకంగా అభినందించారు. షూటింగ్‌తో ఎంతో బిజీగా వున్న సినిమాపై వున్న ఆసక్తితో ఈ చిత్రాన్ని చూసిన ప్రభాస్ చిత్ర యూనిట్ అందరికి తన శుభాకాంక్షలు అందజేశాడు.