Prabhas Fans Hugely Disappointed : ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది :-

Prabhas Fans Hugely Disappointed : అవును మీరు చదివింది నిజమే. ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు నిరాశ చెందుతారు అని అనుకుంటున్నారా. సోషల్ మీడియా లో మీమ్స్ చూస్తేనే అర్ధం అయిపోతుంది.
మ్యాటర్ లోకి వెళ్తే ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు చాల ఘనంగా జరిగాయి. ఎప్పటిలాగే ప్రభాస్ అభిమానులు కూడా బాగా సెలబ్రేషన్స్ చేశారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్నది మాత్రం జరగలేదు అని తీవ్ర నిరాశకు గురయ్యారు. అదేంటని అనుకుంటున్నారా.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ నటిస్తున్న 4 సినిమాల టీమ్స్ నుంచి వీడియో కానీ, హై లెవెల్ లో పోస్టర్స్ కానీ కానుకగా వదులుతారు అని ఎంతగానో వారం రోజులనుంచి ఎదురు చుసిన విషయం తెలిసిందే. అభిమానులు కోరుకున్న విధంగా ఒక రాధే శ్యామ్ చిత్రబృందం తప్ప మిగితా చిత్రబృందాలు కోరికను తీర్చలేకపోయారు..
రాధేశ్యామ్ చిత్రబృందం టీజర్ వదిలి సినిమా మీద ఎన్నడూలేని రీతిలో హైప్ లేపించేశారు. కాకపోతే ప్రభాస్ అభిమానులు ప్రశాంత్ నీల్ సాలార్ సినిమా లో గ్లింప్సె కానీ మోషన్ పోస్టర్ కానీ ఊహించుకున్నారు , సాలార్ తో పాటు ఆదిపురుష్ మరియు స్పిరిట్ సినిమా టీం నుంచి కూడా ఇదే కోరుకున్నారు.
కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లు సాలార్ , ఆదిపురుష్ , స్పిరిట్ , ప్రాజెక్ట్ కే చిత్రబృందాలు ప్రభాస్ లేని పోస్టర్స్ వదిలి , హ్యాపీ బర్త్డే ప్రభాస్ అని విష్ చేశారు. ఈ విషయం లోనే ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యి సోషల్ మీడియా లో వారి బాధను మీమ్స్ రూపం లో చిత్రబృందాలని ట్యాగ్ చేసి వ్యక్తం చేస్తున్నారు.
రాధేశ్యామ్ సినిమా వీడియో తప్ప మిగితా సినిమా టీం నుంచి కోరుకున్న రీతిలో అప్ డేట్స్ రాలేదు. ఇంకా చేసేదేం లేక ప్రభాస్ అభిమానులు రాధేశ్యామ్ వీడియో తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలకు సిద్ధం అయింది.