Prabhas Birthday Special Surprises to fans : ప్రభాస్ అభిమానులకు అప్డేట్స్ లా జాతరే :-

Prabhas Birthday Special Surprises to fans : యంగ్ రెబెల్ స్టార్ కాదు కాదు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి గురించి ఎంత చెప్పిన తక్కువే. బాహుబలి తర్వాత అయన ప్యాన్ ఇండియా లెవెల్ లోనే వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు.
అయితే ప్రభాస్ ప్రస్తుతం సాలార్ , ఆదిపురుష్ షూటింగ్ తో బిజీ అవ్వగా త్వరలో ప్రాజెక్ట్ కే మరియు స్పిరిట్ షూట్ మొదలబెట్టబోతునన్నారు.
ఇదిలా ఉండగా ప్రభాస్ పుట్టినరోజు రాబోతుంది. అక్టోబర్ 23 న ప్రభాస్ అభిమానులు పుట్టినరోజు ని ఘనంగా జరుపుకుంటారు. అయితే ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా రాధే శ్యామ్ సినిమా నుంచి స్పైసి అప్ డేట్ రాబోతుంది , సాలార్ చిత్ర బృందం కూడా అభిమానాన్ని అలరించేందుకు ప్రశాంత్ నీల్ రేంజ్ లో ప్లాన్ చేసారు. ఇక ఆదిపురుష్ చిత్ర బృందం కూడా ప్రభాస్ పాత్రకి సంబంధించిన టీజర్ విడుదల చేయబోతున్నారని చిత్రసీమలో టాక్.
వీటితోపాటు స్పిరిట్ , ప్రాజెక్ట్ కే కి సంబందించిన పోస్టర్స్ దానికితోడు ప్రభాస్ 26 , 27 వ సినిమాల అనౌన్స్మెంట్ గ్రాండ్ గా వెల్లడించబోతున్నారు. ఇప్పటికే మీకు అర్ధం అయింటది ప్రభాస్ పుట్టినరోజున దాదాపు 6-7 సినిమాల అప్ డేట్స్ రావడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేవు.
ఇప్పటినుంచే అభిమానులు పుట్టిరోజున ఏ లెవెల్ లో సెలెబ్రేట్ చేయాలనీ ప్లాన్ చేసే పనిలో బిజీ అవ్వగా , ఇపుడు ఇన్ని అప్ డేట్స్ వస్తున్నాయి అని తెలిస్తే సెలెబ్రేషన్స్ పీక్స్ లో ఉంటుందని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. చూడాలి మరి ప్రభాస్ అభిమానులు మరియు ప్రభాస్ సినిమా అప్ డేట్స్ ఏ రేంజ్ లో హుంగామ చేయబోతున్నాయో.