Prabhas and Prashanth Neel Mythological script ready : ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ రెండవ సినిమా స్క్రిప్ట్ రెడీ :-

Prabhas and Prashanth Neel Mythological script ready : ప్రశాంత్ నీల్ ఎవరో స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు అనుకుంట. కే.జి యఫ్. తో ప్రపంచమంతా తన సత్తా చాటిన డైరెక్టర్. ఇపుడు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో కలిసి ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సాలార్ అనే సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.
ఇదిలా ఉండగా యావత్ ప్రపంచం అంత ప్రశాంత్ నీల్ కే.జి.యఫ్ చాప్టర్ 2 కోసం ఎదురు చూస్తుంది. ఈ సినిమా సమ్మర్ 2022 లో విడుదల అని అధికారికంగా ప్రకటించారు. దీనితో పాటు నీల్ మరియు ప్రభాస్ కలిసి చేస్తున్న సాలార్ సినిమా షూట్ ఇదివరకే మొదలయింది. ఈ సినిమా కూడా సమ్మర్ లేదా వచ్చే ఏదాది చివరిలో విడుదలకు సిద్ధం అవుతుంది.
అయితే ఇదివరకే ప్రభాస్ సాలార్ తో పాటు రాధే శ్యామ్ , ఆదిపురుష్ అని మైథలాజికల్ సినిమా తెస్తున్నారు. దీనితో పాటు సాలార్ తర్వాత మరల నీల్ తోనే రెండవ సినిమా చేస్తున్నారని చిత్రసీమలో టాక్.
మ్యాటర్ లోకి వెళ్తే ప్రశాంత్ నీల్ నెవెర్ బిఫోర్ ఇండియా సినిమాగా ఒక మైథలాజికల్ కథ రాసుకున్నారని ఆ కథ ప్రభాస్ కె చెప్పారని. ప్రభాస్ కూడా తన ప్రస్తుత కమిట్మెంట్స్ అయ్యాక ఈ మైథలాజికల్ సినిమా చేయడానికి అంగీకరించారని తెలుస్తుంది.
ఇప్పటికే నీల్ తీసే సాలార్ పైన భారీ హైప్ వచ్చింది. సినిమా టాక్ ఎలా ఉన్న సరే ప్రభాస్ తో ముందుగానే రెండవ సినిమాకి నీల్ అపుడే ఒప్పించడంతో ప్రభాస్ కి నీల్ పైన ఎంత నమ్మకం ఉందనేది అర్ధం అవుతుంది.
చూడాలి మరి ఈ కాంబినేషన్ తో వచ్చే మైథలాజిక్ సినిమా అనౌన్స్మెంట్ అధికారికంగా ఎపుడు ప్రకటిస్తారో.